అరేబియా సముద్రంలో స్కూబా డైవింగ్‌ చేసిన ప్రధాని మోదీ... (ఫొటోలు)

First Published | Feb 26, 2024, 9:15 AM IST

నీళ్లలో మునిగి ఉన్న పురాతన ప్రదేశం ద్వారక వద్ద ప్రార్థనలు చేసిన ప్రధాని మోదీ దీనిని 'చాలా దివ్యమైన అనుభవం' అని పేర్కొన్నారు. 

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం గుజరాత్‌లోని పంచకుయ్ బీచ్‌లో అరేబియా సముద్ర తీరంలో నీటి అడుగుకు వెళ్లి స్కూబా డైవింగ్‌ను ఆస్వాదించారు.

నీటిలో మునిగి ఉన్న పురాతన ద్వారకలో ప్రార్ధనలు చేసిన ప్రధాని మోడీ దీనిని 'చాలా దివ్యమైన అనుభవం' అని పేర్కొన్నారు. 


“నీటిలో మునిగి ఉన్న ద్వారకా నగరంలో ప్రార్థన చేయడం చాలా దివ్యమైన అనుభవం. అని ఎక్స్ లో షేర్ చేసిన ఓ పోస్టులో చెప్పుకొచ్చారు. 

మోదీ స్కూబా డ్రైవింగ్ తరువాత ఆ ఫొటోలను షేర్ చేశారు. తన అనుభవాన్ని ఇలా రాసుకొచ్చారు. ‘‘ఆధ్యాత్మిక వైభవాన్ని చూశాను. కాలాతీత భక్తిని ఆస్వాదించాను. పురాతన యుగానికి కనెక్ట్ అయ్యాను. భగవాన్ శ్రీ కృష్ణుడు మనందరినీ ఆశీర్వదిస్తాడు" అని  ప్రధాని పేర్కొన్నారు

బేట్ ద్వారకా ద్వీపం సమీపంలోని ద్వారక తీరంలో స్కూబా డైవింగ్ నిర్వహిస్తారు. ఇక్కడ పురావస్తు శాస్త్రవేత్తలు వెలికితీసిన..నీటి అడుగున ఉన్న పురాతన ద్వారక అవశేషాలను ప్రజలు చూడవచ్చు.

ఆదివారం తెల్లవారుజామున ప్రధాని నరేంద్ర మోదీ కూడా ద్వారకలోని శ్రీకృష్ణుని ఆలయంలో పూజలు చేశారు. స్కూబా డైవింగ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. 

దేవభూమి ద్వారక జిల్లాలోని బేట్ ద్వారకా ద్వీపాన్ని ఓఖా ప్రధాన భూభాగానికి కలిపే అరేబియా సముద్రంపై దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన 'సుదర్శన్ సేతు'ను ఆయన ఈ రోజును ప్రారంభించారు.

నీళ్లలో మునిగి ఉన్న పురాతన ప్రదేశం ద్వారక వద్ద ప్రార్థనలు చేసిన ప్రధాని మోదీ దీనిని 'చాలా దివ్యమైన అనుభవం' అని పేర్కొన్నారు. 

Latest Videos

click me!