PM Modi: ప్రధాని మోడీకి తగ్గని క్రేజ్..అత్యంత ప్రజాదరణ నేతగా మరోసారి అగ్రస్థానంలో ప్రధాని..!!

First Published | Feb 25, 2024, 5:27 AM IST

PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీ క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచంలో ఏ దేశాధినేతకు లేని ఆదరణ భారత ప్రధాని మోడీకి ఉంది. ఈ విషయాన్నే అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సర్వే వెల్లడించింది.

PM Modi becomes most popular global leader in the world

PM Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రపంచంలో ఏ దేశాధినేతకు లేని ఆదరణ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఉందంటంటే.. అతిశయోక్తి కాదు.  అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెర్చ్ ప్రకారం.. 78.5% ఆమోదం రేటింగ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా నిలిచారు. 

PM Modi becomes most popular global leader in the world

అత్యంత ప్రజాదరణ గల నాయకుల కోసం మార్నింగ్ కన్సల్ట్ ఈ ఏడాది జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 వరకు సర్వే చేపట్టింది. దేశాధినేతలకు వారి సొంత దేశాల్లో ప్రజాదరణ గురించి సర్వే నిర్వహించింది. ఈ  డేటా ఆధారంగా..ప్రధాని మోదీ మరోసారి ప్రజాదరణ కలిగిన నాయకుడిగా టాప్ ప్లేస్ లో నిలిచినట్టు  మార్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది.

Latest Videos


PM Modi becomes most popular global leader in the world

మార్నింగ్ కన్సల్ట్ వెబ్ సైట్ గణాంకాల ప్రకారం.. మోడీకి భారత్ లో 78 శాతం జనాదరణ ఉన్నట్లు తెల్సింది. దేశ జనాభాలో 78 శాతం మోడీ నాయకత్వాన్ని ఆమోదించగా.. 17 శాతం మంది అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరో 6 శాతం మంది మోడీపై ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. ఇలా ప్రధాని మోడీ మోస్ట్‌ పాపులర్‌ గ్లోబల్‌ లీడర్‌గా తొలి స్థానంలో నిలిచారు.

PM Modi becomes most popular global leader in the world

అమెరికా అధ్యక్షుడు బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌.. మోడీ కంటే వెనుకబడి ఉన్నారు. మెక్సికో అధ్యక్షుడు అండ్రూస్‌ మాన్యుల్‌ లోపెజ్‌ ఒబ్రాడర్‌ రెండో స్థానంలో నిలిచారు. ఇక అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ విషయానికి వస్తే.. ఆయనను కేవలం 37 శాతం ఆమోదం పొందగా.. 55 శాతం వ్యతిరేకంగా ఉన్నారు. మొత్తం 8 శాతం మంది ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు.

PM Modi becomes most popular global leader in the world

యూకే ప్రధాని రిషి సునక్‌కు ప్రజల్లో ఆదరణ తగ్గింది. 25 శాతం మంది ప్రజలు సునాక్ నాయకత్వాన్ని ఆమోదించగా.. 66 శాతం మంది అతని లీడర్ షిప్ పై వ్యతిరేకంగా ఉన్నట్లు తేలింది. గతేడాది డిసెంబర్‌ నిర్వహించిన ఇదే సర్వేలో నరేంద్ర మోడీకి 76 శాతం ప్రజాదరణ లభించింది. కాగా నెల రోజుల్లో మరో 2 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.

PM Modi becomes most popular global leader in the world

ప్రధాని మోదీ తర్వాత ఎవరు?

అత్యంత ప్రజాదరణ పొందిన గ్లోబల్ లీడర్ల జాబితాలో.. ప్రధాని మోడీ తర్వాత మెక్సికన్ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ 65 శాతం ఆమోదంతో రెండవ స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో అర్జెంటీనాకు చెందిన జేవియర్ మిలే నాయకత్వాన్ని 63 శాతం ఆమోదిస్తున్నారు. ముఖ్యంగా.. రాబోయే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు కూడా ఉన్నందున ప్రధాని మోదీ ప్రజాదరణ పెరుగుతోందని సర్వేలో నెలవారీ నవీకరణలు సూచిస్తున్నాయి.

click me!