Anant Ambani Wedding: అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌... హాజరయ్యే ముఖ్య అతిధులు వీరే..

Published : Feb 23, 2024, 04:41 AM IST

 Anant Ambani Wedding: భారతదేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ ఇంట మరో సందడి నెలకొంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ - నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్‌  అబానీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. కాబోయే భార్య రాధిక మర్చంట్‌తో అనంత్ పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నాయి. అటువంటి పరిస్థితిలో ఈ జంట వివాహానికి హాజరయ్యే అతిథులెవరనేది ఆసక్తికరంగా మారింది.  

PREV
16
Anant Ambani Wedding: అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌... హాజరయ్యే ముఖ్య అతిధులు వీరే..
Anant Ambani and Radhika Merchant's pre-wedding ceremonies

Anant Ambani and Radhika Merchant's pre-wedding ceremonies: భారతదేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ ఇంట మరోసారి సందడి నెలకొంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ- నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.  

26
Anant Ambani and Radhika Merchant's pre-wedding ceremonies

 ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్‌ మర్చంట్ - షైలా దంపతుల కుమార్తె రాధికా మర్చంట్‌ ను అనంత్ పెళ్లి చేసుకోనున్నారు. తాజాగా  అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహానికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. 
 

36
Anant Ambani and Radhika Merchant's pre-wedding ceremonies

వివాహా వేడుక కంటే ముందే గుజరాత్‌ లోని జామ్‌ నగర్‌ లో గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమం మార్చి 1- 3 తేదీల మధ్య జరగనుంది.ఈ వేడుక కోసం రిలయన్స్ అధినేత భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు హాజరయ్యే అతిధుల గురించి పలువురు అంతర్జాతీయ ప్రముఖుల పేర్లతో కూడిన పెద్ద సమాచారం బయటకు వచ్చింది.

46
Anant Ambani and Radhika Merchant's pre-wedding ceremonies

ముఖ్య అతిథులు వీరే!: గుజరాత్‌ లోని జామ్‌ నగర్‌ లో జరగనున్న ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, మెలిండా గేట్స్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, ఇవాంకా ట్రంప్, బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫింక్, బ్లాక్‌స్టోన్ చైర్మన్ స్టీఫెన్ స్క్వార్జ్‌మన్, డిస్నీ సీఈవో బాబ్ ఇగర్, మోర్గాన్ స్టాన్లీ సీఈవో టెడ్ పిక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా చైర్మన్ బ్రియాన్ థామస్ మొయినిహాన్ ఉన్నారు. 

56
Anant Ambani and Radhika Merchant's pre-wedding ceremonies

ఇదే సమయంలో.. ఖతార్ ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ, అడ్నాక్ సిఇఒ సుల్తాన్ అహ్మద్ అల్ జాబర్, భూటాన్ రాజు - రాణి, అడోబ్ సిఇఒ శంతను నారాయణ్, టెక్ ఇన్వెస్టర్ యూరి మిల్నర్ వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఈ వేడుకకు హాజరుకానున్నారని సమాచారం.

66
Anant Ambani and Radhika Merchant's pre-wedding ceremonies

కాగా... 2022 డిసెంబర్‌ లోనే అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ ల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది జులై 12న వీరిరువురూ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో జరగనున్న ప్రీవెడ్డింగ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు.  
 

click me!

Recommended Stories