ఎవరీ ప్రహ్లాద్ జోషి.? మోదీ ఈయననే కొత్త విద్యా శాఖ మంత్రిగా ఎందుకు సెలక్ట్ చేశారు.?

Published : Jul 25, 2026, 09:57 PM IST

Prahlad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కేంద్ర విద్యాశాఖ బాధ్యతలను సీనియర్ బీజేపీ నేత ప్రహ్లాద్ జోషికి అప్పగించారు. ఇప్పటికే కేంద్రంలో కీలక శాఖలను నిర్వహిస్తున్న ఆయనకు ఇప్పుడు విద్యాశాఖ బాధ్యతలు కూడా వచ్చాయి.

PREV
14
ప్రహ్లాద్ జోషి ఎవరు?

ప్రహ్లాద్ జోషి కర్ణాటకలోని ధార్వాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు. 2004 నుంచి వరుసగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికవుతూ వస్తున్నారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన పార్టీతో పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రిగా, అలాగే నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ (MNRE) మంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు వీటితో పాటు కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించారు.

24
ప్రహ్లాద్ జోషి రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది?

ప్రహ్లాద్ జోషి చిన్న వయసులోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)తో అనుబంధం ఏర్పరుచుకున్నారు. తర్వాత బీజేపీలో చురుకుగా పనిచేశారు. 1999లో కర్ణాటకలోని హుబ్లీ ఈద్‌గాహ్ మైదానంలో జాతీయ జెండా ఎగురవేయాలంటూ చేపట్టిన ఉద్యమంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2019లో ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ఆయనకు పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖల బాధ్యతలు అప్పగించారు. 2024 వరకు ఆ శాఖలను విజయవంతంగా నిర్వహించిన అనంతరం ప్రస్తుతం మరోసారి కీలక బాధ్యతలను చేపట్టారు.

34
విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి ముందు ఉన్న ప్రధాన సవాళ్లు

ప్రహ్లాద్ జోషి బాధ్యతలు చేపట్టిన సమయంలో విద్యాశాఖ ముందున్న సవాళ్లు చాలా పెద్దవిగా ఉన్నాయి. నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలపై ప్రజల్లో ఏర్పడిన అనుమానాలను తొలగించడం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో సంస్కరణలను పూర్తి చేయడం. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచడం.

సాంకేతిక పరిజ్ఞానంతో భద్రతను బలోపేతం చేయడం. భవిష్యత్తులో NEET-UG సహా ప్రధాన ప్రవేశ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే ప్రణాళికను అమలు చేయడం. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తిరిగి నమ్మకం కల్పించడం. ఈ అంశాలన్నీ ఆయన ముందున్న అత్యంత కీలక బాధ్యతలుగా భావిస్తున్నారు.

44
కొనసాగుతున్న విద్యా సంస్కరణలు.. ఇప్పుడు జోషి పాత్ర ఏంటి?

ధర్మేంద్ర ప్రధాన్ హయాంలో జాతీయ విద్యా విధానం (NEP) 2020 అమలు వేగం పెరిగింది. కొత్త పాఠ్య ప్రణాళికలు, డిజిటల్ విద్య, ఉన్నత విద్యలో పరిశోధనకు ప్రోత్సాహం, విదేశీ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాలు వంటి అనేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో నీట్ సహా పలు పరీక్షల్లో అవకతవకల ఆరోపణలు రావడంతో ప్రభుత్వం పరీక్షల వ్యవస్థలో పెద్ద ఎత్తున మార్పులు ప్రారంభించింది. ఇప్పటికే విద్యాశాఖలో ఉన్నతాధికారుల బదిలీలు జరిగాయి. కొత్త అధికారులను నియమించి వ్యవస్థను మరింత బలోపేతం చేసే చర్యలు చేపట్టింది.

ఇప్పుడు ఈ సంస్కరణలను సమర్థతంగా అమలు చేయడం, పరీక్షల వ్యవస్థను మరింత విశ్వసనీయంగా మార్చడం, దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో నమ్మకాన్ని పెంపొందించడం వంటి కీలక బాధ్యతలు కొత్త విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిపై ఉన్నాయి. ఆయన నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం విద్యా రంగంలో చేపట్టిన మార్పులు ఎలా అమలవుతాయన్నది దేశవ్యాప్తంగా ఆసక్తిగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories