Dharmendra Pradhan: మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. యువత ఆకాంక్షలను గౌరవిస్తూ, విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదనే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ధర్మేంద్ర ప్రధాన్ 1969 జూన్ 26న ఒడిశాలోని తాల్చేర్‌లో జన్మించారు. ఆయన తండ్రి దేవేంద్ర ప్రధాన్, తల్లి బసంత్ మంజరి ప్రధాన్. దేవేంద్ర ప్రధాన్ కూడా మాజీ కేంద్ర మంత్రిగా సేవలందించారు. ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశాలోని ఉత్కల్ యూనివర్సిటీ (వాణి విహార్) నుంచి ఆంత్రోపాలజీ (మానవశాస్త్రం)లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.
25
విద్యార్థి నాయకుడిగా తొలి అడుగులు
ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశలోనే మొదలైంది. 1983లో తాల్చేర్ కాలేజీలో చదువుతున్నప్పుడే అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) లో యాక్టివిస్ట్ గా చేరారు. 198లో తాల్చేర్ కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.1993 - 1995లో తన నాయకత్వ పటిమతో ఎదిగి, 1993లో ABVP ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా, 1995లో జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.1998లో అధికారికంగా భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు.
35
రాష్ట్ర రాజకీయాల నుంచి పార్లమెంట్ వరకు
2000లో తొలిసారి ఒడిశా శాసనసభకు ఎన్నికైన ఆయన, 2004లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. తర్వాత రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు. కాలక్రమేణా జాతీయ రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదిగిన ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తుతం ఒడిశాలోని సంబల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యువమోర్చా నాయకత్వం 2001లో ఒడిశా BJYM అధ్యక్షుడిగా, 2002లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా, 2004లో BJYM జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. జూన్ 2024లో జరిగిన ఎన్నికల్లో 18వ లోక్‌సభకు విజయం సాధించారు. ఇంధన శాఖ, పెటిషన్ల కమిటీ, టెలికాం లైసెన్సుల కేటాయింపులపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) వంటి అనేక కీలక కమిటీలలో సభ్యుడిగా పనిచేశారు.
మోదీ ప్రభుత్వంలో ధర్మేంద్ర ప్రధాన్ అత్యంత కీలకమైన పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు. 2017 - 2019 వరకు పెట్రోలియం, సహజ వాయువుల శాఖ, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక వేత్తల శాఖ మంత్రిగా సేవలందించారు. 2019 - 2021లో పెట్రోలియం & సహజ వాయువుల శాఖతో పాటు స్టీల్ (ఉక్కు) శాఖ మంత్రిగా పనిచేశారు. జూలై 7, 2021న కేంద్ర విద్యుత్, విద్యా శాఖ (Minister of Education) మంత్రిగా, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా జూన్ 9, 2024న మళ్లీ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
55
ఆసక్తికర విశేషాలు
ధర్మేంద్ర ప్రధాన్ తండ్రి దేవేంద్ర ప్రధాన్ కూడా వాజపేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నిరుపేద మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే "ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY)" పథకాన్ని దిగ్విజయంగా అమలు చేసి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే 1997లో విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు ఒడిశాలో క్వశ్చన్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఆ సమయంలో జరిగిన లఠీఛార్జీలో ఆయన తీవ్రంగా గాయపడినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. వ్యక్తిగత జీవితానికి వస్తే ధర్మేంద్ర ప్రధాన్.. డిసెంబర్ 9, 1998న మృదులా ఠాకూర్ ప్రధాన్‌ను వివాహమాడారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.