రన్నరపుగా నిలిచిన ఈ యంగ్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద తన ప్రతిభతో కోట్లాదిమంది భారతీయుల హృదయాలు గెలుచుకున్నాడు. ప్రజ్ఞానందా కనపరచిన ప్రతిభకు ఆనంద్ మహీంద్రా ముగ్ధుడై ఓ బహుమతి కూడా ప్రకటించారు. ప్రజ్ఞానంద తల్లిదండ్రులైన రమేష్ బాబు, నాగలక్ష్మిలకు ఎక్స్యువి 400 ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ మేరకు వారికి రెండు రోజుల క్రితం కారును అందజేశారు.