వయసులో తనకంటే చిన్నవాడితో మహిళ వివాహేతర సంబంధం.. ఈ విషయం భర్తకు తెలియడంతో..

Published : Aug 29, 2023, 12:22 PM ISTUpdated : Aug 29, 2023, 12:24 PM IST

ఓ మహిళ వయసులో తనకంటే చిన్నవాడైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పనిచేసే చోట పరిచయమైన అతడితో రాసలీలలు కొనసాగించింది. చివరకు అతడితో కలిసి బతకాలని  భావించింది. ఈ క్రమంలోనే వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి అంతమొందించింది. 

PREV
17
వయసులో తనకంటే చిన్నవాడితో మహిళ వివాహేతర సంబంధం.. ఈ విషయం భర్తకు తెలియడంతో..
illegal love age

ఓ మహిళ వయసులో తనకంటే చిన్నవాడైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పనిచేసే చోట పరిచయమైన అతడితో రాసలీలలు కొనసాగించింది. చివరకు అతడితో కలిసి బతకాలని  భావించింది. ఈ క్రమంలోనే వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి అంతమొందించింది. 

27

ఈ ఘటన తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. చెల్లిపాలేనికి చెందిన పెరియసామి(37), ప్రేమ(35) దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ నెల 23వ తేదీ ఉదయం ప్రేమ చెవినొప్పి వచ్చిందని భర్తతో చెప్పింది. దీంతో పెరియస్వామి బైక్‌పై ప్రేమను మోహనూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు.

37

అయితే పోయిరిక్కరై ప్రాంతంలో తన భర్తను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందని, దీంతో అతడు మృతిచెందాడని ప్రేమ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇదే విషయాన్ని పెరియసామి కుటుంబ సభ్యులకు కూడా తెలపింది. అయితే ఈ ప్రమాదంలో తనకు స్వల్ప గాయాలు అయినట్టుగా ప్రేమ పేర్కొంది. 
 

47
illegal love

అయితే ప్రేమకు స్వల్ప గాయాలు కావడం, ఆమె వ్యవహర శైలిపై పోలీసులకు, పెరియస్వామి కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. ఈ క్రమంలోనే పోలీసులు ప్రేమ సెల్‌ఫోన్‌ను పరిశీలించగా ధర్మపురి జిల్లా నాట్రంపల్లి ప్రాంతానికి చెందిన నందికేశవన్ (28)తో తరచూ మాట్లాడేదని గుర్తించారు. తదుపరి విచారణలో.. ప్రేమ అతనితో వివాహేతర సంబంధం కొనసాగించినట్టుగా తేలింది. 
 

57

ఈ విషయమై పోలీసులు సీరియస్‌గా విచారించగా.. ప్రేమ బేకరీలో పనిచేస్తున్నప్పుడు నందికేశవన్‌తో పరిచయం ఏర్పడి అతనితో వివాహేతర సంబంధం కొనసాగించిందని తేలింది. విషయం తెలుసుకున్న పెరియస్వామి భార్యను మందలించాడని పోలీసులు గుర్తించారు.

67

దీంతో ప్రేమను ఉద్యోగం మాన్పించేసి ఇంట్లోనే ఉంచాడు. అయితే నందికేశవన్‌తో బంధాన్ని  కొనసాగించాలని ప్రేమ భావించింది. ఈ క్రమంలోనే తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హతమార్చాలని పథకం వేసింది. చెవి నొప్పి అంటూ డ్రామా ఆడి భర్త పెరియసామిని బయటకు తీసుకెళ్లింది. ఆ తర్వాత మోహనూర్ సమీపంలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి హతమార్చింది. 

77

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ప్రేమ, నందికేశవన్‌లతో పాటు ధనుష్ అనే వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.

click me!

Recommended Stories