ప్రధాని మోదీకి యూట్యూబ్ ఛానల్ ... నెలకు ఎన్నికోట్ల ఆదాయం వస్తుందో తెలుసా?

Published : Jan 10, 2025, 10:36 PM IST

ప్రధానమంత్రి మోదీ యూట్యూబ్ ఛానల్ ప్రతి నెలా గణనీయమైన ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఈ ఛానల్ ప్రతి నెల సగటు రెవెన్యూ ఎంతో తెలుసా? 

PREV
15
ప్రధాని మోదీకి యూట్యూబ్ ఛానల్ ... నెలకు ఎన్నికోట్ల ఆదాయం వస్తుందో తెలుసా?
Narendra Modi Youtube Channel

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫేస్‌బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ఖాతాలు కలిగి ఉన్నారు. అదేవిధంగా  ఆయనకు నరేంద్ర మోదీ అనే అధికారిక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ ఛానల్ అక్టోబర్ 26, 2007న ప్రారంభించబడింది. ప్రాజెక్ట్ ప్రారంభోత్సవాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ఆయన ఇంటర్వ్యూలుతో సహా మోదీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఈ ఛానల్ ప్రసారం చేస్తుంది

25
Narendra Modi Youtube Channel

ప్రధానమంత్రి మోదీ యూట్యూబ్ ఛానల్ 26.5 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో 20 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్న ఏకైక రాజకీయ నాయకుడు ఆయనే. అంతేకాకుండా వీక్షణలు (వ్యూస్), లైక్‌ల ద్వారా ఈ ఛానల్ ప్రతి నెలా గణనీయమైన ఆదాయాన్ని ఆర్జిస్తోంది

35
Narendra Modi Youtube Channel

ఓ నివేదిక ప్రకారం ప్రధానమంత్రి మోదీ యూట్యూబ్ ఛానల్ నెలకు $189,000 (INR 1,62,49,520.70) నుండి $567,100 (INR 4,87,47,697.38) వరకు సంపాదిస్తుంది. ఈ ఛానల్ ఇప్పటివరకు 29,272 వీడియోలను అప్‌లోడ్ చేసింది, 6,360,331,183 వీక్షణలను సాధించింది

45
Narendra Modi Youtube Channel

ఈ ఛానల్‌లో అప్‌లోడ్ చేసిన చాలా వీడియోలు 40,000 వీక్షణలను దాటుతున్నాయి. అధిక సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య, వీక్షణల కారణంగా ప్రధానమంత్రి మోదీ యూట్యూబ్ ఛానల్ గణనీయమైన ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రతి వారం సగటున 19 వీడియోలు అప్‌లోడ్ చేయబడతాయి. ప్రధానమంత్రి మోదీకి ఫేస్‌బుక్‌లో 48 మిలియన్ల మంది ఫాలోవర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 82.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు

55
Narendra Modi Youtube Channel

ప్రధానమంత్రి మోదీ తర్వాత బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో యూట్యూబ్ సబ్‌స్క్రైబర్‌ల పరంగా రెండవ అత్యధిక ర్యాంక్ కలిగిన ప్రపంచ నాయకుడు, ఈయన 6.4 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను కలిగివున్నాడు . ఇది మోదీ సబ్‌స్క్రైబర్‌ల సంఖ్యలో నాలుగో వంతు మాత్రమే

Read more Photos on
click me!

Recommended Stories