Prayagraj Mahakumbh Mela 2025
తలపై కలశం, మెడలో బ్యానర్ - ఎవరీ మీసాల బాబా?
;ప్రయాగరాజ్ మహా కుంభమేళా 2025లో కొత్త ముఖం కనిపిస్తోంది. ఇంటర్నేషనల్ మీసాల నర్తకి రాజేంద్ర కుమార్ తివారీ అలియాస్ 'దుకాన్ జీ' ప్రత్యేక దుస్తులతో అవగాహన కార్యక్రమం మొదలుపెట్టారు. తలపై కలశం, మెడలో స్వచ్ఛతా, పర్యావరణ పరిరక్షణ సందేశాలున్న బ్యానర్లు ఆయన ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారం స్వచ్చ కుంభమేళాకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
Prayagraj Mahakumbh Mela 2025
వీధి నాటకాలు,ర్యాలీలు :
ప్రయాగరాజ్ కుంభమేళా స్వచ్చ కుంభమేళాగా ప్రకటించింది యోగి సర్కార్. ఈ క్రమంలో ప్రయాగరాజ్ ప్రజలనే కాదు కుంభమేళాకు వచ్చే భక్తులకు స్వచ్చతపై అవగాహన కల్పిస్తోంది. ఇందుకోసం వీధి నాటకాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సృష్టి బెస్ట్ మేనేజ్‌మెంట్ వారు నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో జనాలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గంగానదిని కాలుష్య రహితంగా ఉంచాలనే సందేశాన్ని ఇచ్చారు.
Prayagraj Mahakumbh Mela 2025
సృష్టి బెస్ట్ మేనేజ్‌మెంట్ స్వచ్ఛతా బ్రాండ్ అంబాసిడర్ 'దుకాన్ జీ' మహాకుంభ్‌లో ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. ఊరేగింపుల్లో స్వచ్ఛత, గంగా పరిరక్షణ నినాదాలు రాసిన దుస్తులు ధరించి ఆయన సందేశం అందరికీ చేరుతోంది.
Prayagraj Mahakumbh Mela 2025
స్వచ్చ కుంభమేళాకు సాదువుల మద్దతు
మహాకుంభ్‌లో భండారాలలో పాలిథిన్‌కు బదులు మట్టి కుల్లడ్లు, కాగితపు కప్పులు, పత్రావళి వాడాలని సాధువులు, మహామండలేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. గంగానది కాలుష్య రహితంగా ఉండటానికి ఇది ముఖ్యమైన చర్యగా వారు సూచిస్తున్నారు.
Prayagraj Mahakumbh Mela 2025
కాలుష్య రహితం సందేశం :
మహాకుంభ్ 2025లో భక్తులు గంగానదిలో పూలమాలలు, హవన సామగ్రి వేయవద్దని కోరారు. పవిత్ర నది శుభ్రంగా ఉండాలి. ఇది మత విశ్వాసానికి ప్రతీక మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛతపై అవగాహన కల్పించడంలో కీలకమని ఈ మీసాల బాబా చెబుతున్నారు.