PM Modi: 10 కోట్లు దాటిన మోదీ ఇన్‌స్టా ఫాలోవ‌ర్లు.. ప్ర‌ధానికి సోష‌ల్ మీడియా ద్వారా డ‌బ్బులొస్తాయా.?

Published : Feb 26, 2026, 04:33 PM IST

PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ (10 కోట్లు) ఫాలోవర్లు దాటారు. ఈ ఘనత సాధించిన ప్రస్తుత ప్రపంచ నాయకుల్లో ఆయన మొదటి స్థానంలో నిలిచారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మోదీకి డబ్బు వస్తుందా అనే ప్రశ్న చాలా మందిలో వస్తోంది. 

PREV
15
ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీకి ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 10 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న జాతీయ నాయకుల్లో ఇంత ఎక్కువ ఫాలోవర్లు ఉన్న నాయకుడు మోదీ మాత్రమే. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు సుమారు 43 మిలియన్ ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. ఈ లెక్కలో మోదీకి ట్రంప్ కంటే రెండింతలు ఎక్కువ ఫాలోవర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

25
ఫాలోవర్లు ఎక్కువగా ఉంటే డబ్బు వస్తుందా?

ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ ఫాలోవర్లు ఉన్నంత మాత్రాన డబ్బు రాదు. ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా ఇన్‌స్టాగ్రామ్ నేరుగా డబ్బు చెల్లించదు. ఇన్‌స్టాగ్రామ్ నుంచి డబ్బు రావాలంటే.. అకౌంట్ ప్రొఫెషనల్ లేదా క్రియేటర్ అకౌంట్ కావాలి. ప్లాట్‌ఫామ్ నియమాలు పాటించాలి, మోనిటైజేషన్ ఆప్షన్ ఉండాలి. కానీ ప్రధాని మోదీ అకౌంట్‌ ప్రజా నాయకుడిగా ఉపయోగిస్తున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆయనకు ఇన్‌స్టాగ్రామ్ నుంచి వ్యక్తిగత ఆదాయం రావడం లేదు.

35
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా డబ్బు సంపాదించే మార్గాలు

సాధారణంగా క్రియేటర్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప‌లు మార్గాల్లో సంపాదిస్తారు. అవేంటంటే..

బ్రాండ్ ప్రమోషన్:

కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రచారం చేయడానికి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారులకు డబ్బు ఇస్తాయి. ఎక్కువ ఫాలోవర్లు ఉన్న వారికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

రీల్స్ ద్వారా ఆదాయం:

రీల్స్‌కు ఎక్కువ వ్యూస్ వస్తే కొంత ఆదాయం వస్తుంది. చిన్న క్రియేటర్లకు 10 వేల వ్యూస్ వస్తే ఒక రీల్‌కు సుమారు రూ.500 నుంచి రూ.2000 వరకు రావచ్చు.

ఇన్‌స్టాగ్రామ్ గిఫ్ట్స్:

రీల్స్ చూస్తున్న వారు స్టార్ లేదా గిఫ్ట్ పంపించవచ్చు. ఒక స్టార్ ధర సుమారు 0.01 అమెరికన్ డాలర్ ఉంటుంది. దీనికి కనీసం 500 ఫాలోవర్లు అవసరం.

అఫిలియేట్ మార్కెటింగ్:

ప్రొడక్ట్ లింక్ పెట్టి విక్రయాలు జరిగితే కమిషన్ వస్తుంది.

45
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా డబ్బు రావడానికి అవసరమైన నియమాలు

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆదాయం పొందాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. ప్రొఫెషనల్ లేదా బిజినెస్ అకౌంట్ ఉండాలి. వయసు 18 సంవత్సరాలు దాటాలి. కంటెంట్ స్వంతంగా ఉండాలి. ప్రొఫైల్ పబ్లిక్‌గా ఉండాలి. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ పాటించాలి. బ్యాంక్ ఖాతా లింక్ చేయాలి. నియమాలు పాటించకపోతే ఆదాయాన్ని నిలిపివేస్తారు.

55
మోదీకి సోషల్ మీడియా ద్వారా ఆదాయం ఉందా?

ప్రధాని నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్‌ను ప్రజలతో సంబంధాలు పెంచుకునేందుకు ఉపయోగిస్తున్నారు. ఆయన ఖాతా ద్వారా వ్యక్తిగతంగా డబ్బు సంపాదించడం లేదు. ఇన్‌స్టాగ్రామ్ ఆదాయం సాధారణంగా యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లకు మాత్ర‌మే వ‌స్తుంది. కాబ‌ట్టి 10 కోట్ల ఫాలోవర్లు ఉన్నా ప్రధాని మోదీకి ఇన్‌స్టాగ్రామ్ నుంచి నేరుగా డబ్బు రావడం లేదు అని చెప్పవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories