నెలంతా టోల్ కట్టకుండానే ప్రయాణించవచ్చని చెప్తే మీరు నమ్ముతారా..? ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. అయితే ఈ అవకాశం అందరికి కాదు కొందరికి మాత్రమే… అలాగనీ ఎవరో విఐపిలకు కాదు సామాన్య ప్రజలకే…
జాతీయ, రాష్ట్ర రహదారులపై రోజూ లక్షల వాహనాలు టోల్ ప్లాజాలు దాటుతుంటాయి. ప్రతి వాహనం టోల్ కట్టడం తప్పనిసరి. కానీ కేవలం రూ.340 చెల్లించి నెలంతా ఎన్నిసార్లైనా టోల్ దాటొచ్చనే విషయం చాలామందికి తెలియదు. ఇది వీఐపీలకు మాత్రమే కాదు, సాధారణ ప్రజలకు కూడా వర్తిస్తుంది.
25
ప్రయాణంలో డబ్బులు ఆదా..
అయితే ఈ రూ.340 నెలవారీ పాస్ టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వారికి మాత్రమే లభిస్తుంది. పని మీద రోజూ రెండు, మూడు సార్లు టోల్ దాటే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. రోజుకు రూ.60-100 టోల్ చెల్లిస్తే నెలకు రూ.2000-3000 ఖర్చవుతుంది. కానీ ఈ పాస్‌తో రూ.340కే నెలంతా తిరగొచ్చు.
35
ఈ టోల్ పాస్ ఎలా పొందాలి..?
ఈ సదుపాయం ప్రైవేట్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. ట్యాక్సీలు, కమర్షియల్ వాహనాలకు ఇది వర్తించదు. పాస్ కోసం నేరుగా టోల్ ప్లాజా ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్ కార్డు, కరెంట్ బిల్లు లేదా రేషన్ కార్డుతో అడ్రస్ వెరిఫై చేస్తారు. ఆ తర్వాత రూ.340 చెల్లిస్తే నెలవారీ పాస్ ఇస్తారు.
టోల్ ప్లాజాలు కేవలం రుసుము వసూలు చేయడమే కాదు, కొన్ని ఉచిత సేవలు కూడా అందిస్తాయి. ప్రయాణికుల కోసం తాగునీరు, మగవారికి, మహిళలకు వేర్వేరు టాయిలెట్ల సౌకర్యం ఉచితంగా ఉంటుంది. కొద్దిసేపు వాహనాలు పార్క్ చేసుకునేందుకు స్థలం ఉంటుంది, కానీ ఎక్కువ సేపు ఆపడానికి అనుమతి లేదు.
55
టోల్ ప్లాజా కల్పించే సౌకర్యాలు..
అంతేకాదు, అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్), అంబులెన్స్ సర్వీస్, వాహనం బ్రేక్‌డౌన్ అయితే క్రేన్ సహాయం వంటివి కూడా ఉచితంగా అందిస్తారు. ప్రతి టోల్ ప్లాజా వద్ద ఒక హెల్ప్‌లైన్ నంబర్ ఉంటుంది. అత్యవసర సహాయం కావాలంటే ఆ నంబర్‌కు కాల్ చేయవచ్చు. ఈ విషయాలు తెలుసుకుంటే డబ్బు ఆదా అవ్వడమే కాకుండా, కష్టకాలంలోనూ ఉపయోగపడతాయి.