PM Modi: ప్రధాని మోదీ సంచలన ప్రకటన.. పార్లమెంట్‌లో కొత్త బిల్లు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు !

Published : Jul 24, 2026, 08:25 AM IST

PM Modi: పేపర్ లీక్‌లపై కఠిన చట్టం, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీని గురించి ప్రధాని నరేంద్ర మోదీ వీడియో ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు.

PREV
16
పేపర్ లీక్ ముఠాలకు బిగ్ షాక్: కఠిన బిల్లు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు

దేశవ్యాప్తంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసే లక్షలాది మంది స్టూడెంట్స్ ఆందోళనల వేళ కేంద్ర ప్రభుత్వం ఒక బిగ్ డిసిషన్ తీసుకుంది. ముఖ్యంగా NEET-UG వంటి కీలక పరీక్షల్లో పేపర్ లీకేజీలు విపరీతమైన వివాదానికి దారితీయడంతో, స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. గురువారం రాత్రి సోషల్ మీడియా లో ఓ కీలక వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేశారు. పేపర్ లీక్ అనేది కేవలం ఒక సాధారణ నేరం కాదని, లక్షలాది మంది విద్యార్థుల కలలు, వారి తల్లిదండ్రుల ఆవేదనతో ముడిపడి ఉన్న తీవ్రమైన అంశమని మోదీ స్పష్టం చేశారు. బాధ్యులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని తీవ్ర హెచ్చరికలు జారీ చేశార

26
ప్రధాని మెసేజ్.. నేడు క్యాబినెట్ భేటీలో నిర్ణయం

గురువారం రాత్రి విడుదల చేసిన దాదాపు 3 నిమిషాల వీడియో సందేశంలో ప్రధాని మోదీ పలు కీలక విషయాలను వెల్లడించారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యం అని చెప్పారు. విద్యార్థుల ఒక సంవత్సరం కాలం వృథా కాకూడదనే ఉద్దేశంతోనే సుమారు 22 లక్షల మంది అభ్యర్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించి, జూలై 19న ఫలితాలను సైతం విడుదల చేశామని గుర్తు చేశారు.

ఈ పేపర్ లీక్ ఘటనలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేకంగా చట్టపరమైన సంస్కరణలు తేనున్నట్లు వెల్లడించారు. దీనిపై సంబంధిత శాఖల నుంచి తీర్మానాన్ని తెప్పించుకున్నామని, శుక్రవారం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించి ఆమోదిస్తామని తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండో వారంలోనే ఈ కొత్త బిల్లును సభ ముందుకు తెచ్చి చట్టంగా మారుస్తామని హామీ ఇచ్చారు.

36
ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కఠిన శిక్షలు

పేపర్ లీక్ కేసుకు సంబంధించి నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా దేశవ్యాప్తంగా ప్రత్యేక 'ఫాస్ట్ ట్రాక్ కోర్టులు' ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

• ఈ కొత్త బిల్లు ద్వారా పరీక్షా కేంద్రాల్లో డిజిటల్ మానిటరింగ్‌ను భారీగా పెంచనున్నారు.

• అక్రమాలకు పాల్పడే వ్యక్తులు లేదా ముఠాలకు జీవితాంతం జైలు శిక్ష (యావజ్జీవ ఖైదు) పడేలా కఠిన నిబంధనలను చేర్చనున్నారు.

ప్రధాని మోదీ ప్రకటన వెలువడిన వెంటనే ఢిల్లీ హైకోర్టు కూడా వేగంగా స్పందించింది. క్రిమినల్ కేసుల విచారణ కోసం జడ్జి అనూ గ్రోవర్ బాలిగాను ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

46
ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిపై వేటు

పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల స్థాయిలో కీలక మార్పులు చేసింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వినీత్ జోషిని ఆ బాధ్యతల నుంచి తక్షణమే తప్పించింది. ఆయన స్థానంలో 1994 రాజస్థాన్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి నరేష్ పాల్ గంగ్వార్‌ను నూతన కార్యదర్శిగా నియమించింది. గంగ్వార్ గతంలో పర్యావరణ, మత్స్య, పాడి పరిశ్రమల శాఖల్లో కీలక పదవుల్లో సేవలుందించారు.

56
రాహుల్ గాంధీ ఫైర్

మరొకవైపు ప్రధాని మోదీ వీడియో సందేశంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని వీడియో రిలీజ్ చేయడం వల్ల విద్యార్థుల ఆవేదనకు పరిష్కారం దొరకదని, అది వారి మేథస్సును అవమానించడమేనని ఎక్స్ లో విమర్శించారు.

"విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం స్పష్టమైన డిమాండ్లతో వీధుల్లో పోరాడుతున్నారు" అని రాహుల్ కామెంట్ చేశారు. వరుస లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అంతేకాకుండా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు.

66
విద్యార్థుల పోరాటానికి దక్కిన విజయమా?

గత కొన్ని నెలలుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ సహా దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువజన సంఘాలు పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నాయి. ఈ ప్రజాందోళనతో తీవ్ర ఒత్తిడికి గురైన కేంద్ర ప్రభుత్వం, చివరికి వ్యవస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టక తప్పలేదు. ఏది ఏమైనా, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే ఈ కొత్త చట్టం దేశంలో పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories