PM Kisan 24th Installment: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు ఖాతాలోకి ఎప్పుడంటే?

Published : Oct 13, 2026, 10:33 AM IST

PM Kisan 24th Installment: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 24వ విడత నిధులు త్వరలో విడుదల కానున్నాయి. అర్హులైన రైతులు తమ మొబైల్ నంబర్, ఈ-కేవైసీ వివరాలను ఆన్‌లైన్‌లో త్వరగా అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.

PREV
15
పీఎం కిసాన్ 24వ విడత వచ్చేస్తోంది.. ఈ తప్పులు చేస్తే డబ్బులు రావు

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 24వ విడత డబ్బుల కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ. 6,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2,000 చొప్పున మూడు విడతలుగా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు.

గతేడాది లేదా గత విడతల నిబంధనలను చూస్తే, అక్టోబర్ చివరి వారం నుంచి నవంబర్ మధ్యలో ఈ నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. నవంబర్ 15 లోపు పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు రైతులు అకౌంట్లలో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, ప్రభుత్వం తరఫున అధికారిక తేదీ ఇంకా వెల్లడి కాలేదు. అయతే, సంబంధిత వర్గాలు రైతులకు పలు సూచనలు చేశాయి.

25
పీఎం కిసాన్ : మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయడం ఎందుకు ముఖ్యం?

రైతులు తమ పీఎం కిసాన్ పోర్టల్‌లో మొబైల్ నంబర్‌ను సరిగ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. రికార్డుల్లో పాత లేదా తప్పు నంబర్ ఉంటే, ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన మెసేజ్‌లు, అలర్ట్‌లు అందవు. ఖాతాలో రూ. 2,000 జమ అయిన వెంటనే బ్యాంకు నుంచి మెసేజ్ రావాలంటే మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి.

ఒకవేళ నంబర్ మారిపోతే వెంటనే ఆన్‌లైన్‌లో మార్చుకోవాలి. లేదంటే రాబోయే విడత సమాచారం తెలియక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎన్‌పీసీఐ మ్యాపింగ్, ఆధార్ లింకింగ్ సరిగ్గా ఉన్నాయో లేదో ముందే చెక్ చేసుకోవడం మంచిది.

35
ఆన్‌లైన్‌లో మొబైల్ నంబర్ మార్చుకోవడం ఎలా?

పీఎం కిసాన్ ఖాతాలో మొబైల్ నంబర్ మార్చడం చాలా ఈజీ. ఈ కింద చెప్పిన స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది..

• ముందుగా మీ మొబైల్ లేదా లాప్‌టాప్‌లో అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ఓపెన్ చేయండి.

• హోమ్‌పేజీలో మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసే ఆప్షన్ వెతకండి.

• మీ ఆధార్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయండి.

• స్క్రీన్ మీద వచ్చే ఇన్ స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి.

• కొత్త మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేయండి.

• ప్రాసెస్ పూర్తయిన తర్వాత మీ నంబర్ అప్‌డేట్ అయిందో లేదో కన్ఫర్మ్ చేసుకోండి. ఒకవేళ ఆన్‌లైన్‌లో ఆప్షన్ కనిపించకపోతే, దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

45
రూ. 4,000 జమ అయ్యే అవకాశం ఎవరికి ఉంటుంది?

కొంతమంది రైతులకు గత విడత డబ్బులు నిలిచిపోయి ఉంటాయి. ఒకవేళ మీ 23వ విడత డబ్బులు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయి ఉంటే, అవి క్లియర్ అయిన తర్వాత 24వ విడత డబ్బులతో కలిపి మొత్తం రూ. 4,000 ఖాతాలో జమ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇది అందరికీ వర్తించదు.

ఎవరికైతే గతంలో డబ్బులు ఆగిపోయాయో, వారి రీజన్ బట్టి ఇది మారుతుంది. అలాగే, కొన్ని ప్రాంతాల్లో తనిఖీల సమయంలో వేలాది మంది అనర్హులుగా తేలినట్లు రిపోర్టులు వచ్చాయి. కాబట్టి ఎటువంటి తప్పులు లేకుండా చూసుకోవడం ముఖ్యం.

55
బెనిఫిషియరీ స్టేటస్ ఆన్‌లైన్‌లో చెక్ చేయడం ఎలా?

మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో ఇంట్లోనే ఇలా చెక్ చేసుకోవచ్చు..

• pmkisan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.

• హోమ్‌పేజీలో 'Know Your Status' ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

• మీ రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.

• 'Get Data' పైన క్లిక్ చేస్తే మీ ఈ-కేవైసి స్టేటస్, ఎలిజిబిలిటీ వివరాలు కనిపిస్తాయి.

అర్హత ఉండి కూడా డబ్బులు రావాలంటే రైతులు ఈ-కేవైసి, ల్యాండ్ రికార్డ్ వెరిఫికేషన్, ఆధార్- బ్యాంకు అకౌంట్ లింకింగ్ కచ్చితంగా పూర్తి చేసి ఉంచుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories