Pawan Kalyan: తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మార్పులు జరగనున్నాయా.? ఇందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్యవర్తిగా వ్యవహరించనున్నారా.? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనపై వివిధ రకాల ఒత్తిడులు పెరుగుతున్నాయి. సినిమా వివాదాలు, విచారణలు, వ్యక్తిగత సమస్యలు వంటి అంశాలు ఆయనను రాజకీయంగా కూడా ప్రభావితం చేస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరీముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు బయటకు రావడం ఆయనకు అసౌకర్యంగా మారిందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన కొత్త రాజకీయ వ్యూహం గురించి ఆలోచిస్తున్నట్లు సమాచారం.
25
ఎన్డీఏ నుంచి బిగ్ ఆఫర్.?
రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, విజయ్‌ను ఎన్డీఏ కూటమిలోకి తీసుకురావడానికి ప్రత్యేక వ్యూహం సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ఆ వ్యూహంలో భాగంగా “రెండున్నర సంవత్సరాలు విజయ్ ముఖ్యమంత్రి… తరువాత రెండున్నర సంవత్సరాలు మరో నాయకుడు ముఖ్యమంత్రి” అనే ప్రతిపాదన వచ్చినట్లు చర్చ జరుగుతోంది. ఈ ఆఫర్ రాజకీయంగా చాలా పెద్ద సంచలనంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
35
మధ్యవర్తిగా పవన్ కల్యాణ్?
ఈ చర్చల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు కూడా వినిపిస్తోంది. పవన్ కల్యాణ్‌కు సౌత్‌లో మంచి పరిచయాలు ఉండటం వల్ల ఆయన ద్వారా ఈ రాజకీయ సందేశం వెళ్లినట్లు కొన్ని వర్గాలు చెబుతున్నాయి. దీంతో సౌత్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రతిపాదనలో ముఖ్యమైన పాత్ర ఎదప్పాడి కె పలనిస్వామిదేనని చెబుతున్నారు. మొదట ఈ ప్రతిపాదనపై ఆయన కొంత సందేహంగా ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే ఆయన పార్టీకి స్వతంత్రంగా పోటీ చేసే శక్తి ఉందని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే కేంద్ర నాయకత్వం నుంచి వచ్చిన సూచనల తర్వాత ఈ అంశంపై మళ్లీ చర్చ జరుగుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
55
తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణలు
ఈ రాజకీయ చర్చలు నిజమైతే తమిళనాడు రాజకీయాల్లో పెద్ద మార్పు రావచ్చు. విజయ్‌కు ఉన్న యువత మద్ధతు, ఎడప్పాడికి ఉన్న గ్రామీణ ఓటు బ్యాంక్, ఎన్డీఏకు ఉన్న కేంద్ర స్థాయి బలం — ఈ మూడు కలిసి వస్తే రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అందువల్ల ఈ వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చలుగానే కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.