Vande Mataram Bill: ఇకపై దేశభక్తి గీతం వందే మాతరాన్ని అవమానిస్తే కటకటలాకే. ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. లోక్‌సభ ఈ బిల్లును వాయిస్ ఓట్ ద్వారా ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత అమల్లోకి రానుంది.
ఇకపై దేశభక్తి గీతం వందే మాతరాన్ని అవమానిస్తే ఇకపై కటకటలాకే. ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. లోక్‌సభ ఈ బిల్లును వాయిస్ ఓట్ ద్వారా ఆమోదించింది. లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు నిరసనలు చేస్తూనే ఉన్నారు. నీట్ (NEET) పేపర్ లీక్ ఇష్యూపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. సభలో గందరగోళం నెలకొన్నప్పటికీ బిల్లును వాయిస్ ఓట్‌తో ఆమోదించింది.
24
బిల్లులో ఏముంది?
'ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టు నేషనల్ హానర్ (సవరణ) బిల్లు-2026' ద్వారా 1971లో తీసుకొచ్చిన Prevention of Insults to National Honour Actలో కీలక మార్పు చేశారు. ఇప్పటి వరకు ఈ చట్టం భారత రాజ్యాంగం, జాతీయ జెండా, జాతీయ గీతం (National Anthem)ను అవమానిస్తే శిక్ష విధించే నిబంధనలు ఉన్నాయి. అయితే తాజా సవరణతో దేశభక్తి గీతం వందే మాతరాన్ని కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం జాతీయ గౌరవ చిహ్నాలను ఉద్దేశపూర్వకంగా అవమానిస్తే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది.
34
రాజ్యసభలో తీవ్ర చర్చ
జూలై 29న రాజ్యసభలో ఈ బిల్లుపై విస్తృతంగా చర్చ జరిగింది. చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం కాంగ్రెస్‌తో పాటు పలు ప్రతిపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. చర్చకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ... ఈ బిల్లు దేశ గౌరవం, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడానికేనని చెప్పారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో 'వందే మాతరం' కీలక పాత్ర పోషించిందని, అది దేశభక్తికి ప్రతీకగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
బిల్లుకు సపోర్ట్ చేసిన సభ్యులు జాతీయ చిహ్నాలకు మరింత చట్టబద్ధ రక్షణ అవసరం అని అభిప్రాయపడ్డారు. అయితే ప్రతిపక్ష సభ్యులు ఇలాంటి కీలక అంశాలపై మరింత విస్తృత చర్చ, రాజకీయ ఏకాభిప్రాయం ముఖ్యమని సూచించారు. జూలై 24న రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు, జూలై 29న అక్కడ ఆమోదం పొందింది. అనంతరం జూలై 30న లోక్‌సభ కూడా ఆమోదం తెలపడంతో రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇది చట్టంగా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.