భారత్ ను రెచ్చగొడుతున్న పాక్.. 1972 సిమ్లా ఒప్పందం రద్దు.. ఏంటీ ఈ సిమ్లా ఒప్పందం?

Published : Apr 25, 2025, 04:09 PM IST

1972 Simla Agreement-Impact on India-Pakistan Relations: 1971 ఇండో-పాక్ యుద్ధం తర్వాత కుదిరిన చారిత్రాత్మక 1972 సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ తాజాగా రద్దు చేసింది. అసలు ఏంటీ సిమ్లా ఒప్పందం? భారత్ -  పాకిస్తాన్ సంబంధాలు ఎలా ప్రభావితమవుతాయి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.   

PREV
15
భారత్ ను రెచ్చగొడుతున్న పాక్.. 1972 సిమ్లా ఒప్పందం రద్దు..  ఏంటీ ఈ సిమ్లా ఒప్పందం?
Simla Agreement Suspended: Indo-Pak Tensions Soar After Pahalgam Attack

1972 Simla Agreement - Impact on India-Pakistan Relations: జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ తీరుపై తీవ్రంగా స్పందిస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ భారత్ ను మరింత రెచ్చగొడుతోంది. 1971 ఇండో-పాక్ యుద్ధం తర్వాత కుదిరిన చారిత్రాత్మక 1972 సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ రద్దు చేసింది.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశం తీసుకున్న కఠిన చర్యలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్ పాకిస్తాన్ తో ఏ ఒప్పందాలు ఉంచుకోకూడదని నిర్ణయం తీసుకుంటూ అన్ని కట్ చేసుకుంది. 

 

25
Historic Simla Treaty Cancelled: What It Means for India-Pakistan Relations

సిమ్లా ఒప్పందం అంటే ఏమిటి?

1972 జూలై 2న హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఇరు దేశాలు చేసుకున్న ఒప్పందం. 1971 యుద్ధం తర్వాత భారత్-పాక్ మధ్య శాంతిని నెలకొల్పడంలో సిమ్లా ఒప్పందం కీలకపాత్ర పోషించింది. ఇందిరా గాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఇరు దేశాల మధ్య శాంతియుత సహజీవనం, పరస్పర గౌరవం కోసం ఈ ఒప్పందం రూపొందించారు. సిమ్లా ఒప్పందం ద్వైపాక్షిక చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం, ఒకరికొకరు భూభాగ సమగ్రతను గౌరవించుకోవడం వంటి సూత్రాలతో దశాబ్దాల దౌత్యం కోసం పునాది వేసింది.

 

35
End of a Peace Pact: Pakistan Withdraws from Simla Agreement

సిమ్లా ఒప్పందంలో ఏముంది?

ఇరు దేశాలు సంఘర్షణలను, ఘర్షణలను అంతం చేసి, స్నేహపూర్వక, సామరస్యపూర్వక సంబంధాలను పెంపొందించుకోవాలి. శాశ్వత శాంతిని నెలకొల్పాలి అని సిమ్లా ఒప్పందంలో ఇరు దేశాలు అంగీకారం తెలుపుతూ సంతకం చేశాయి. సిమ్లా ఒప్పందంలోని కీలక విషయాలు ఇలా ఉన్నాయి.. 

  • ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలు, లక్ష్యాలు ఇరు దేశాల మధ్య సంబంధాలను నిర్వచిస్తాయి.
  • ఇరు దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా లేదా పరస్పరం అంగీకరించిన ఇతర శాంతియుత మార్గాల ద్వారా తమ విభేదాలను పరిష్కరించుకుంటాయి.
  • ఏదైనా సమస్యకు తుది పరిష్కారం వచ్చే వరకు, ఏకపక్షంగా పరిస్థితిని మార్చకూడదు. శాంతియుత, సామరస్యపూర్వక సంబంధాలను దెబ్బతీసే చర్యలను నిరోధించాలి.
45
Suspends 1972 Simla Agreement After India's Tough Measures
  • శాంతియుత సహజీవనం, ఒకరికొకరు భూభాగ సమగ్రత, సార్వభౌమాధికారం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం వంటివి సయోధ్య, మంచి పొరుగువారి సంబంధాలు, శాశ్వత శాంతికి ముందస్తు అవసరాలు.
  • గత 25 సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసిన ప్రాథమిక సమస్యలు, సంఘర్షణలకు కారణాలను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలి.
  • ఒకరికొకరు జాతీయ ఐక్యత, భూభాగ సమగ్రత, రాజకీయ స్వాతంత్య్రం, సార్వభౌమత్వాన్ని ఎల్లప్పుడూ గౌరవించుకోవాలి.
  • ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం, ఒకరికొకరు భూభాగ సమగ్రత లేదా రాజకీయ స్వాతంత్య్రంపై బలప్రయోగం చేయకూడదు.
55
India Pakistan

సిమ్లా ఒప్పందం రద్దుతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరగడానికి, LoC ఉల్లంఘనలకు, దాని స్థితిపై కొత్త వివాదాలు మరింత పెరిగే అవకాశముంది. అన్ని సమస్యలను శాంతియుత మార్గాల్లోనే పరిష్కరించుకోవాలన్న ఒప్పందంలోని నిబద్ధత అధికారికంగా తొలగిపోతుంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

Read more Photos on
click me!

Recommended Stories