Owaisi: పాక్ క్రికెట‌ర్ అఫ్రిదికి ఓవైసీ స్ట్రాంగ్ కౌంట‌ర్‌.. పనికిరాని వాళ్ల గురించి మాట్లాడడం వేస్ట్ అంటూ

Published : Apr 29, 2025, 12:11 PM IST

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర భయానక వాతావరణాన్ని సృష్టించిన విష‌యం తెలిసిందే. 26 మంది అమాయ‌క ప్ర‌జ‌ల ప్రాణాల‌ను ముష్క‌ర‌లు బ‌లితీసుకున్నారు. ఈ సంఘ‌ట‌న‌తో యావ‌త్ దేశం ఒక్క‌టైంది. ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ తీరును పార్టీల‌కు అతీతంగా ఖండిస్తున్నారు.   

PREV
13
Owaisi: పాక్ క్రికెట‌ర్ అఫ్రిదికి ఓవైసీ స్ట్రాంగ్ కౌంట‌ర్‌..  పనికిరాని వాళ్ల గురించి మాట్లాడడం వేస్ట్ అంటూ
Shahid Afridi

ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌ను పాక్ ప్రోత్స‌హిస్తోంద‌ని భార‌త ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇప్ప‌టికే పాకిస్థాన్‌పై నిషేధాజ్ఞ‌లు విధించింది. అదే విధంగా భార‌త్‌లో ఉంటున్న పాకిస్థానీయుల‌ను వెంట‌నే దేశం విడిచి వెళ్లాల‌ని ఆదేశాలు సైతం జారీ చేశారు. ఈ క్ర‌మంలోనే ఇరు దేశాల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. పాకిస్థాన్‌కు చెందిన కొంద‌రు చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై భార‌త్‌లో తీవ్ర వ్య‌తిరేక‌త‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

23
Shahid afridi

ఈ ఉదంతంపై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కశ్మీర్‌లో ఏ చిన్న సంఘటన జరిగినా భారత్‌ వెంటనే పాకిస్తాన్‌పై నింద వేస్తుందని, ఉగ్ర‌దాడుల్లో అసలైన సాక్ష్యాలు చూపాలని డిమాండ్ చేశారు. “టపాసులు పేలినా భారత్‌ నింద వేస్తోంది” అంటూ అఫ్రిది నొటికొచ్చిన‌ట్లు మాట్లాడారు. భారత్‌ తన తప్పుల్ని తనే స్వీకరించుకోవాలంటూ భారత ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేశారు.

33
Asaduddin Owaisi (Photo: ANI)

అఫ్రిది చేసిన వ్యాఖ్య‌లు భార‌త్‌లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ జర్నలిస్టు ఈ విషయంపై ప్రశ్నించగా.. “షాహిద్ అఫ్రిది ఎవరు? అతని లాంటి జోకర్ల పేర్లు నా ముందు తీసుకురావద్దు.

అతను చేసిన వ్యాఖ్యలు చౌకబారు డ్రామాలకు నిదర్శనం. పనికిరాని వ్యక్తుల గురించి మాట్లాడటం సమయం వృథా” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, పాకిస్తాన్‌ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) ‘గ్రే లిస్ట్’లో ఉంచాలని డిమాండ్ చేశారు. 

Read more Photos on
click me!

Recommended Stories