ఆడామగ తేడాలేదు... ఆర్టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే లక్కీ ఛాన్స్

Published : Apr 28, 2025, 03:47 PM ISTUpdated : Apr 28, 2025, 03:51 PM IST

తెలుగు రాష్ట్రాలు ఆర్టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నాయి. అయితే తమిళనాడులో ఆడామగ తేడాలేకుండా ఏడాదిపాటు ఆర్టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే లక్కీ ఛాన్స్ కల్పిస్తోంది. 

PREV
14
ఆడామగ తేడాలేదు... ఆర్టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే లక్కీ ఛాన్స్
Tamilnadu RTC

స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించారు. కాబట్టి ఈ ఎండలనుండి ఉపశమనం కోసం చాలామంది పిల్లలను తీసుకుని టూర్ ప్లాన్ చేస్తుంటారు. అంటే ఎండలు మండిపోతున్నా ప్రయాణాలు మాత్రం తగ్గవన్నమాట. సొంతూళ్లకు వెళ్లేవారు కొందరయితే చల్లని ప్రాంతాలకు విహారయాత్రలకు వెళ్లేవారు మరికొందరు. అయితే సెలవు రోజుల్లో రైళ్లలో ఖాళీ ఉండదు... ముందే రిజర్వేషన్లు చేసుకుంటారు. కాబట్టి ప్రజలు ప్రభుత్వ, ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించాలని ప్లాన్ చేస్తున్నారు.

అయితే ప్రజలను ఆకర్షించేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ తో పోటీపడుతోంది తమిళనాడు ఆర్టిసి. తక్కువ ధరకే ప్రయాణ సౌకర్యం కల్పించడమే అద్భుతమైన ఆఫర్లు ఇస్తోంది. ఇలా తమిళనాడు ఆర్టిసిలో ప్రయాణించేవారికి జాక్‌పాట్ అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకుని 01.04.2025 నుండి 15.06.2025 వరకు ప్రయాణించేవారిలో 75 మంది ప్రయాణికులను కంప్యూటర్ ద్వారా ఎంపిక చేసి బహుమతులు ఇస్తామని ప్రకటించారు. 
 

24
Tamilnadu RTC

తమిళనాడు ఆర్టిసి ఇచ్చే బహుమతులివే : 

నిర్ణీత కాలంలో తమిళనాడు ఆర్టిసి బస్సుల్లో ప్రయాణించేవారిలో మొదటి బహుమతి కోసం 25 మందిని సెలెక్ట్ చేస్తారు. వీరు ఒక సంవత్సరం పాటు 20 సార్లు ఉచిత ప్రయాణం (1.07.2025 నుండి 30.06.2026 వరకు) పొందవచ్చు. 

రెండవ బహుమతి కింద ఇంకో 25 మందిని ఎంపిక చేస్తారు. వీరికి కూడా ఒక సంవత్సరం పాటు 10 సార్లు ఉచిత ప్రయాణం (01.07.2025 నుండి 30.06.2026 వరకు) కల్పిస్తారు. 

మూడవ బహుమతి కింద మరో 25 మందికి ఎంపిక చేస్తారు. వీరికి సంవత్సరంలో 5 సార్లు ఉచిత ప్రయాణం (01.07.2025 నుండి 30.06.2026 వరకు) చేసే సదుపాయం కల్పిస్తారు.

34
Tamilnadu RTC

టికెట్ బుక్ చేసుకోండి - బహుమతి గెలుచుకోండి

ప్రభుత్వ బస్సుల్లో ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకుని ప్రయాణించండి. మీరు కూడా పోటీలో గెలిచేవారిలో ఒకరు కావచ్చు! టికెట్ బుకింగ్ కోసం: www.tnstc.in మరియు TNSTC అధికారిక మొబైల్ యాప్ ఉపయోగించండి.

44
Tamilnadu RTC

తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఆఫర్లు పెట్టాలి : 

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఆర్టిసి ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది. దీంతో ఆర్టిసి భారీగా ఆదాయాన్ని కోల్పోతోంది. ఉచిత ప్రయాణం కాబట్టి బస్సులన్ని మహిళలతో నిండిపోతున్నారు... దీంతో పురుషులు బస్సు ఎక్కేందుకు భయపడుతున్నారు. అయితే తమిళనాడు ఆర్టిసి మాదిరిగా తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించి ప్రయాణికులను ఆకర్షించే ప్లాన్ చేయాలి. తద్వారా ఆర్టిసికి మంచి ఆదాయం వస్తుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories