Operation kagar: ఆప‌రేష‌న్ క‌గార్ ల‌క్ష్యం ఏంటి.? ఇప్ప‌టి వ‌ర‌కు ఏం చేశారు.? అస‌లేం జ‌రుగుతోంది..

Published : May 01, 2025, 03:13 PM ISTUpdated : May 01, 2025, 03:14 PM IST

దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా తరిమివేసే 'ఆపరేషన్ కగార్' కొనసాగిస్తాం. నక్సలిజాన్ని తుదముట్టించే వరకు భద్రతా బలగాల దాడులు జరుగుతూనే ఉంటాయి. 2026 మార్చి 31 వరకు నక్సల్స్ రహిత దేశంగా భారత్ ను తీర్చి దిద్దుతాం. ఇవీ ఆపరేషన్ కగార్ గురించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
16
Operation kagar: ఆప‌రేష‌న్ క‌గార్ ల‌క్ష్యం ఏంటి.? ఇప్ప‌టి వ‌ర‌కు ఏం చేశారు.? అస‌లేం జ‌రుగుతోంది..

ఆపరేషన్ కగార్ అంటే ఏమిటి?

ఆపరేషన్ కగార్ అనేది కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో భద్రతా బలగాలు చేపట్టిన భారీ అటవీ యుద్ధ వ్యూహం. దీని ప్రధాన లక్ష్యం మావోయిస్టు తీవ్రవాదాన్ని నిర్మూలించటమే. ఈ ఆపరేషన్ 2024 చివర్లో ప్రారంభమై, 2026 మార్చి 31 లోపు మావోయిస్టు నెట్‌వర్క్‌ను పూర్తిగా కూలదోసే ఉద్దేశంతో ముందుకెళ్తోంది.

26

ఎందుకు ప్రారంభించారు?

మావోయిస్టుల ఆధిక్యం ఉన్న అటవీ ప్రాంతాల్లో ప్రభుత్వం నియంత్రణ కోల్పోతుండటం. అబూజ్‌మడ్ వంటి ప్రధాన బేస్‌లను కోల్పోయిన మావోయిస్టులు ఇప్పుడు కర్రెగుట్ట వంటి ప్రాంతాల్లో షెల్టర్ తీసుకోవడం. తెలంగాణ–ఛత్తీస్‌గఢ్–మహారాష్ట్ర బార్డర్‌లో వ్యూహాత్మకంగా ఉన్న ఈ ప్రాంతం మావోయిస్టులకు సురక్షిత జోన్‌గా మారడం. భద్రతా సవాళ్లతో పాటు అభివృద్ధిని అడ్డుకుంటున్న అడ్డంకులను తొలగించడమే లక్ష్యం.

36
Maoist

కర్రెగుట్ట ప్రాంత ప్రాధాన్యం ఏమిటి?

ఇది దట్టమైన అడవులతో, కొండలతో, గోదావరి నదీ పరివాహక ప్రాంతంగా ఉంటుంది. మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండటంతో మావోయిస్టులకు దాడులు చేసి తప్పించుకునే అవకాశముంది. గతంలో అబూజ్‌మడ్‌ను కోల్పోయిన తరువాత మావోయిస్టులు ఈ ప్రాంతాన్ని తమ కొత్త బేస్‌గా మార్చుకున్నారు. 

46
maoist

ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు:

ఆప‌రేష‌న్ క‌గార్‌లో భాగంగా ప‌దుల సంఖ్య‌లో మావోయిస్టుల‌ను హ‌త‌మార్చారు. ఈ క్ర‌మంలోనే క‌ర్రెగుట్ట‌పై బ‌ల‌గాలు ప‌ట్టు సాధించాయి. కర్రెగుట్ట ప్రాంతంలో జాతీయ జెండా ఎగ‌ర‌వేశారు. బంకర్లు, ఆయుధాల డంప్‌లు, నష్టపరిచిన శిబిరాలను స్వాధీనం చేసుకున్నారు. శాటిలైట్‌లు, డ్రోన్లు, హెలికాప్టర్ల సహాయంతో ఆప‌రేష‌న్ కొన‌సాగిత‌స్తున్నారు. 800 చదరపు కిలోమీటర్ల పరిధిలోని అడవిలో మావోయిస్టుల కోసం వేట కొనసాగుతోంది. ఇందుకోసం తాత్కాలిక బేస్ క్యాంపులు, కమ్యూనికేషన్ టవర్‌లు ఏర్పాటు చేసుకున్నారు. 

56

వెల్లువెత్తుతోన్న విమ‌ర్శ‌లు: 

ఇదిలా ఉంటే కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై కొన్ని పార్టీలు వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తున్నాయి. మొన్న‌టికి మొన్న తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ‌లో మాట్లాడుతూ.. ఆప‌రేష‌న్ క‌గార్‌ను వ్య‌తిరేకించారు. మావోయిస్టుల‌తో త‌క్ష‌ణ‌మే శాంతి చర్చ‌లు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్ర‌భుత్వం సైతం ఇదే ప్ర‌తిపాద‌న‌ను సూచించింది. ఇక అటవీ ప్రాంతంలోని సహజ వనరులను దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులపై యుద్ధం చేస్తుందని ఆదివాసీ జేఏసీ జాతీయ అధ్యక్షులు చందా లింగయ్య దొర విమ‌ర్శించారు. 

66
Maoist

ఆదివాసీల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తక్షణమే ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని తెలంగాణ మంత్రి సీతక్క కేంద్రాన్ని డిమాండ్​ చేశారు. మంగళవారం హైదరాబాద్​లోని  ప్రజా భవన్​లో మంత్రి సీతక్కతో భారత్ బచావో సంస్థ ప్రతినిధులు గాదె ఇన్నయ్య, డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్, జంజర్ల రమేశ్​బాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆపరేషన్ కగార్ ను నిలిపివేసేలా తనవంతు ప్రయత్నం చేయాలని మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు. 

Read more Photos on
click me!

Recommended Stories