ఈ బ్యాంక్ కస్టమర్ల సొమ్మంతా మాయమా..! ఏకంగా లక్షకోట్లే..!!

Published : Nov 13, 2025, 04:37 PM IST

Bank Glitch : వందలు, వేలు, లక్షలు, కోట్లు కాదు… ఓ బ్యాంకులోని కస్టమర్ల సొమ్ము లక్ష కోట్ల రూపాయలు మాయం అయ్యాయి. ఇంత పెద్దమొత్తంలో డబ్బులు ఏమయ్యాయో తెలుసా?

PREV
15
ఏమిటీ... లక్ష కోట్ల రూపాయల పొరపాటా..!

మన బ్యాంక్ అకౌంట్లో ఒకటి రెండు రూపాయిలు తేడా వస్తేనే కంగారు పడిపోతాం... మన ప్రమేయం లేకుండా డబ్బులు మాయమైతే బ్యాంకుకు పరుగు తీస్తాం. అయితే ఓ బ్యాంకులో ఒకరిద్దరికి కాదు అందరు కస్టమర్లకు ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది... బ్యాంకులోని మొత్తం డిపాజిట్స్ ఖాళీ అయ్యాయి. దీంతో ఖాతాదారులు కంగారుపడిపోయారు... అయితే బ్యాంకు సిబ్బంది తప్పిదంవల్లే ఇదంతా జరిగిందని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. ఇలా ఒకటి రెండు కాదు ఏకంగా లక్ష కోట్లు ఓ బ్యాంక్ నుండి మరో బ్యాంక్ కు పొరపాటున ట్రాన్స్ ఫర్ అయిన ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.

25
బ్యాంకు ఖాతాల్లో లక్షకోట్లు మాయం..

దేశంలోని ప్రముఖ బ్యాంకుల్లో కర్ణాటక బ్యాంక్ ఒకటి. మంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ బ్యాంక్ కేవలం కర్ణాటకలోనే కాదు దేశవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాదాపు 1,000 బ్రాంచ్‌లు ఉన్నాయి. అయితే గతంలో ఈ బ్యాంక్ సిబ్బంది చేసిన ఓ పొరపాటు కస్టమర్స్ డిపాజిట్స్ తో పాటు మొత్తం బ్యాంకులోని సొమ్మును ఖాళీ చేసింది. వేలు, లక్షలు, కోట్లు కాదు... ఏకంగా రూ.1 లక్ష కోట్ల బ్యాంకు అకౌంట్స్ నుండి మాయమయ్యాయి. ఈ డబ్బంతా మరో బ్యాంక్ ఖాతాలో జమ అయ్యింది.

35
అసలేం జరిగింది?

కర్ణాటక బ్యాంక్ సిబ్బంది చేసిన పొరపాటుతో ఆ బ్యాంక్ పునాదులే కదిలిపోయాయి. ఈ బ్యాంక్‌లోని కస్టమర్లు డిపాజిట్లు, ఇతర రూపాల్లో ఉంచిన మొత్తం సొమ్ము వేరే బ్యాంక్ ఖాతాకు బదిలీ అయిందని మనీ కంట్రోల్ ఒక ప్రత్యేక నివేదికలో తెలిపింది. ఇంత మొత్తం డబ్బును కేవలం ఒకే లావాదేవీలో బదిలీ చేశారట. దీన్ని బ్యాంకింగ్ పరిభాషలో 'ఫ్యాట్ ఫింగర్ ఎర్రర్' లేదా పొరపాటున జరిగిన తప్పుగా పేర్కొంటారు. కర్ణాటక బ్యాంకు వ్యవహారం గురించి తెలిసి ఖాతాదారులు ఆందోళనకు గురైనట్లు మనీ కంట్రోల్ తెలిపింది. 

45
కర్ణాటక బ్యాంకుపై ఆర్‌బీఐ ఆగ్రహం

కర్ణాటక బ్యాంకు సిబ్బంది రూ.1,00,000 కోట్ల మొత్తాన్ని పొరపాటున ఒక నిష్క్రియ ఖాతాకు (inactive account) బదిలీ చేశారు. అందుకే ఈ సొమ్ము ఎవరిచేతికి చిక్కలేదు… దీంతో కర్ణాటక బ్యాంక్ సిబ్బంది బయటపడ్డారు. ఆ ఖాతా వాడకంలో లేకపోవడం వల్ల ఈ డబ్బు ఆ ఖాతాదారులకు విధంగానూ ఉపయోగపడలేదు. కానీ సుమారు 3 గంటలపాటు ఈ డబ్బు అదే ఖాతాలో ఉంది… తర్వాత ఈ డబ్బును తిరిగి కర్ణాటక బ్యాంకు పొందగలిగింది.

55
ఈ ఘటన ఎప్పుడు జరిగింది?

కర్ణాటక బ్యాంకులో లక్షకోట్లు మాయమైన ఘటన ఆగస్టు 8, 2023 లో జరిగింది. ఆగస్ట్ 8న సాయంత్రం 5.17 గంటలకు డబ్బులు మాయమయ్యాయని సిబ్బంది గుర్తించారు... ఎంతో కష్టపడి రాత్రి 8.09 గంటలకు డబ్బును తిరిగి పొందారు. ఇలా దాదాపు 3 గంటలు ఈ డబ్బంతా వేరు ఖాతాలో ఉండిపోయింది.

కర్ణాటక బ్యాంక్ వ్యవహారంపై ఆర్‌బీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది..ఈ డబ్బు పొరపాటున బదిలీ అయిందా లేక మరేదైనా ఉద్దేశంతో జరిగిందా అని ఆరా తీశారు. కర్ణాటక బ్యాంక్ రిస్క్ మేనేజ్‌మెంట్ బృందాన్ని మార్చి 11, 2024న దీనిపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

కర్ణాటక బ్యాంకు ఐటీ విభాగం మార్చి 15, 2024న నివేదిక సమర్పించింది. ఇక మార్చి 28న పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా వివరణ ఇచ్చింది. అయితే పొరపాటును సరిదిద్దడంలో ఆలస్యం చేయడం, ఆడిట్ నివేదికలో ఆలస్యంగా ప్రస్తావించడంపై ఆర్‌బీఐ ఆగ్రహంగా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories