Netra vamsi wedding: దేశంలో అత్యంత ఎక్కువ ఖర్చుతో జరిగిన వివాహం అనగానే అనంత్ అంబానే పెళ్లి గుర్తొస్తుంది. అయితే ఇప్పుడు దేశంలో అలాంటి మరో వివాహం జరుగుతోంది. అంగరంగ వైభవంగా సాగుతోన్న ఈ మ్యారేజ్‌కి ప్రపంచనలుమూల నుంచి అతిథులు వస్తున్నారు.
"లేక్ సిటీ"గా ప్రసిద్ధి చెందిన ఉదయపూర్ అందాల మధ్య మళ్లీ ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ హాట్‌టాపిక్‌గా మారింది. ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తులు చేరుకునే ఈ వేడుక నవంబర్ 21 నుంచి 24 వరకు సాగనుంది. రాజస్థాన్ రాజకోటల మధ్య జరుగుతోన్న ఈ రాయల్ వెండ్డింగ్ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.
25
వదుడు, వరుడు ఎవరంటే.?
ఈ వివాహం అమెరికాలో భారీ ఫార్మా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న రామరాజు మంతెన కుటుంబానికి చెందినది. రామరాజు కుటుంబం మూలాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. రామరాజు కూతురు నేత్ర మంతెన పలు టెక్ ప్రాజెక్టుల్లో పనిచేస్తోంది. ఇక వరుడు వంశీ గాదిరాజు – టెక్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న పేరు. "సూపర్ ఆర్డర్" అనే టెక్ ప్లాట్‌ఫారమ్‌కు కో-ఫౌండర్, CTO. రెస్టారెంట్ మేనేజ్‌మెంట్, టేక్‌అవే, డెలివరీ సర్వీసుల్లో ఆధునిక పరిష్కారాలు అందిస్తూ 2024లో Forbes 30 Under 30 – Food & Drink జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆయనకు కొలంబియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది.
35
జూనియర్ ట్రంప్‌తో పాటు..
ఈ వివాహానికి అంతర్జాతీయ సెలబ్రిటీలు హాజరవుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఇప్పటికే భారత్ వచ్చారు. జెనిఫర్ లోపెజ్, జస్టిన్ బీబర్ వంటి గ్లోబల్ మ్యూజిక్ ఐకాన్లు ప్రత్యేక షోలను నిర్వహించారు. శుక్రవారం జరిగిన హల్దీ వేడుకల్లో సందడి చేశారు. బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, నోరా ఫతేహి, కృతి సనన్, మాధురి దీక్షిత్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, జాన్వీ కపూర్ వంటి తారలు వేడుకకు హాజరయ్యారు. మొత్తం 40 దేశాల నుంచి 120కి పైగా ప్రత్యేక అతిథులు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది.
ఈ వివాహానికిగాను ఉదయపూర్ ప్రసిద్ధ వారసత్వ కట్టడాలు కేంద్రంగా మారాయి. వీటిలో సిటీ ప్యాలెస్ కాంప్లెక్స్, ది లీలా ప్యాలెస్ ఉదయపూర్, మానెక్ చౌక్, జెనానా మహల్, పిచోలా సరస్సులోని జగ్‌మందిర్ ఐలాండ్ ప్యాలెస్, లగ్జరీ డెకర్, రాయల థీమ్, భారత-హాలీవుడ్ సాంప్రదాయాల మేళవింపుతో కార్యక్రమాలు సాగుతున్నాయి.
55
'వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్'
మూడు రోజుల పాటు సాగనున్న ఈ రాయల్ వివాహాన్ని వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్‌గా అభివర్ణిస్తున్నారు. ట్రంప్ కొడుకుతో పాటు పెద్ద పెద్ద సెలబ్రిటీలు హాజరవుతుండడంతో ఈ వివాహానికి ప్రాధాన్యత సంతరించుకుంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలే కనిపిస్తున్నాయి.