Recharge Price Hike : న్యూఇయర్ లో మీ ఫోన్ మెయింటెనెన్స్ మరింత కాస్ట్లీ.. మొబైల్ రీచార్జ్ ధరలు పెంపు..?

Published : Dec 11, 2025, 09:27 AM IST

Mobile Recharge Rates Hike : కొత్త సంవత్సరం నుండి ప్రజలపై కొత్త భారం పడనుందా…? మొబైల్ ఫోన్ మెయింటెనెన్స్ మరింత భారం కానుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.   

PREV
14
రీచార్జ్ ధరలు పెరుగుతాయా?

Recharge price Hike : ఫ్రీ సిమ్, ఫ్రీ డేటా... ఫ్రీ టాక్ టైమ్... మా సేవలన్నీ ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ. ఇది ఓ ప్రైవేట్ టెలికాం సంస్థ వినియోగదారులను వలవేసేందుకు చేసిన ప్రయోగం. అది సక్సెస్ అయ్యింది... ఇలా ఫ్రీగా సర్విసెస్ అందుతున్నాయని కోట్లాదిమంది ఆ టెలికాం సంస్థకు చేరువయ్యారు. ఇలా గతంలో ఫ్రీ అన్న సంస్థ ఇప్పుడు వినియోగదారులపై మెళ్లిగా బారం మోపుతోంది... రీచార్జ్ ధరలను క్రమక్రమంగా పెంచుతోంది. ఈ సంస్థ ఇంకెదో ఇండియాలోనే టాప్ ప్రైవేట్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ రిలయన్స్ జియో.

ఇప్పటికే జియోతో పాటు ఎయిర్ టెల్, వొడాఫోన్-ఐడియా (Vi) వంటి ప్రధాన టెలికాం సంస్థలు రీచార్జ్ ధరలు పలుమార్లు పెంచాయి. తాజాగా మరోసారి తమ వినియోగదారులపై భారం మోపేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ నెల (డిసెంబర్) చివర్లో లేదంటే 2026 ఆరంభంలో మొబైల్ రీచార్జ్ ధరలు పెరిగే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ టెలికాం కంపెనీలు ఇప్పటివరకయితే రీచార్జ్ ధరల పెంపుపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేవు.

24
రీచార్జ్ ధరలు ఎంత పెరుగుతాయి?

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం... ప్రైవేట్ టెలికాం సంస్థలు రీచార్జ్ ధరలను 10 నుండి 12 శాతం పెంచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడున్న ప్లాన్స్ మరింత ప్రియం కానున్నాయి... వినియోగదారులపై అదనపు భారం పడనుంది.

కొన్ని చెల్లింపు యాప్స్ ఈ రీచార్జ్ ధరల పెంపు గురించి తెగ ప్రచారం చేస్తున్నాయి. టెలికాం కంపెనీలు ధరలు పెంచేలోపే మీ నెంబర్ ను ఇప్పుడున్న ధరలతోనే రీచార్జ్ చేసుకోవాలని సూచిస్తోంది. అయితే ఇది పేమెంట్స్ యాప్స్ బిజినెస్ ట్రిక్ అని కొందరు... లేదు లేదు నిజంగానే రీచార్జ్ ధరలు పెరుగుతాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

34
ఇప్పటికే చవక ప్రీపెయిడ్ ప్లాన్ తొలగించిన టెలికాం కంపెనీలు

ప్రధాన టెలికాం కంపెనీలు ఇప్పటివరకు తమ వినియోగదారులకు అందించిన చవక రీచార్జ్ ప్లాన్స్ ను తొలగిస్తున్నాయి. ఈ చర్యలు కూడా రీచార్జ్ ధరలు పెరుగుతాయనే ప్రచారానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఎయిర్ టెల్ ఇప్పటికే రూ.121, రూ.181 (30 రోజుల వ్యాలిడిటితో కూడిన ప్లాన్స్), రూ.249 వంటి ప్లాన్స్ నిలిపివేసింది. జియో కూడా రూ.249 ప్లాన్ (28 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 1GB డేటా) ను నిలిపివేసింది. ఇలా ప్లాన్స్ తొలగించడంకాదు... ఏకంగా అన్ని రీచార్జ్ ప్లాన్స్ ధరలు పెంచాలని టెలికాం సంస్థలు భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

44
బిఎస్ఎన్ఎల్ కు మరింత లాభం..

గతంలో ప్రైవేట్ టెలికాం సంప్థలు రీచార్జ్ ధరలు పెంచడంతో ప్రభుత్వ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వినియోగదారులు పెరిగారు. ఈ ప్రభుత్వరంగ సంస్థ ఎలాంటి రీచార్జ్ ధరలు పెంచలేదు... ప్రైవేట్ సంస్థలకు ధీటుగా చవకైన ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో బిఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఇప్పుడు మళ్లీ ప్రైవేట్ టెలికాం సంస్థలు రీచార్జ్ ధరలు పెంచుతాయని ప్రచారం జరుగుతోంది... ఇదే జరిగితే మళ్లీ బిఎస్ఎన్ఎల్ కు లాభం జరిగే అవకాశాలున్నాయి. మరింతమంది ప్రైవేట్ టెలికాం సంస్థలను వీడి బిఎస్ఎన్ఎల్ లో చేరే అవకాశాలుంటాయి. మరి వినియోగదారులు చేజారకుండా ఉండేదుకైనా టెలికాం సంస్థలు రీచార్జ్ ధరలు పెంపుపై వెనక్కి తగ్గుతాయా..? లేక తమ వ్యాపారాన్ని విస్తరణ కోసం ఛార్జీలు పెంచుతున్నామంటూ భారం మోపుతాయా? ఏ నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories