VB-G RAM G : కూలీలకు నిరుద్యోగ భృతి.. అందకుంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయండి

Published : Jan 20, 2026, 11:40 AM IST

VB G RAM G : కేవలం గ్రామీణ ఉపాధి హామీ పేరు మార్చడమే కాదు ఈ చట్టంలోని అనేక అంశాలను మార్చింది కేంద్రం. ఇందులో ఒకటి కూలీలకు నిరుద్యోగ భృతి. దీని గురించి టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. 

PREV
15
VB-G Ram G ఉపాధి హామీ పథకం

గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీల కోసం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అమలుచేస్తోంది. గతంలో వ్యవసాయ పనుల కాలంలోనే కూలీలకు పని లభించేది... మిగతారోజుల్లో ఉపాధిలేక కూలీలు ఇబ్బందిపడేవారు. వీరికోసమే సరిగ్గా 20 ఏళ్ల కిందట (2005 లో) కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) తీసుకువచ్చింది. అయితే తాజాగా ఈ చట్టాన్ని మోదీ సర్కార్ మార్చింది... వికసిత్ భారత్- గ్యారంటీ ఫర్ రోజ్ గార్ & అజివిక మిషన్ (గ్రామీణ్) (VB-G RAM G) గా పేరు పెట్టింది.

అయితే ఈ కొత్త చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూలీల సంఖ్యను తగ్గిస్తారు... పనిదినాలు తగ్గుతాయి...చెల్లింపులు సరిగ్గా జరగవు.. ఇలాంటి అనేక అనుమానాలను ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజల అనుమానాలను నివృత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమయ్యింది. అందుకే కేవలం విబి- జి రామ్ జీ పథకం కోసమే ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటుచేసింది.

25
ఉపాధి హామీ టోల్ ఫ్రీ నంబర్

కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ కూలీల సౌకర్యార్థం టోల్ ఫ్రీ నంబర్ 1800-200-1001 కేటాయించింది. ఉపాధి హామీ పనిదినాలు, వేతనంకు సంబంధించిన వివరాలను ఈ నంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే కూలీలకు పనిముట్లు అందించడం నుండి తాగునీరు, ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలు కల్పించాలి... ఆడామగా తేడాలేకుండా సమాన వేతనం చెల్లించాలి... గ్రామానికి 5 కిలోమీటర్ల లోపు పని కల్పించాలి... వీటిలో ఏది అమలుకాకున్నా ఈ టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి పిర్యాదు చేయవచ్చు. ఇది 24 గంటలు అందుబాటులో ఉంటుంది... ఏ సమయంలో అయినా కాల్ చేయవచ్చు. ఈ టోల్ ఫ్రీ నంబర్ కు అందే ఫిర్యాదులు వెంటనే సంబంధిత అధికారులకు చేరతాయి.. తద్వారా వారు వెంటనే చర్యలు తీసుకుంటారు. 

35
ఉపాధి కూలీల వేతనం పెంపు...

విబి-జి రామ్ జి ఉపాధిహామీ పథకంలో పనిదినాలను పెంచడమే కాదు జీతం కూడా పెంచింది కేంద్రం. ఇప్పటివరకు కేవలం 100 రోజులే పని కల్పించగా ఇకపై 125 రోజులు పని కల్పించనున్నారు. అంతేకాదు గతంలో కూలీలకు ప్రతిరోజు రూ.250 వేతనం చెల్లించగా దీన్ని రూ.307 కు పెంచింది కేంద్రం. ఇలా దాదాపు నాలుగు నెలలపాటు ఉపాధి కల్పించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

45
కూలీలకు నిరుద్యోగ భృతి...

విబి-జి రామ్ జీ పథకం కింద గ్రామీణ ప్రాంతాలకు చెందిన కూలీలు ఉపాధి కోరితే తప్పకుండా కల్పించాలి. ఒకవేళ ఉపాధి కల్పించలేని పక్షంలో సదరు కూలీలకు నిరుద్యోగ భృతి చెల్లించాలి... అంటే పని చేయకున్నా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. వేతనాల చెల్లింపులో ఆలస్యం జరిగినా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా విబి-జి రామ్ జి పథకంలో కూలీలకు అనుకూలంగా అనేక అంశాలను చేర్చినట్లు కేంద్రం చెబుతోంది.

55
రైతులకు కూడా విబి-జి రామ్ జి అనుకూలం...

MGNREGA పథకంలో అనేక మార్పులు చేపట్టి కొత్త చట్టం VB-G RAM G తీసుకువచ్చింది కేంద్రం. ఉపాధి హామీ వల్ల వ్యవసాయానికి కూలీల కొరత ఏర్పడుతోందనే వాదన ఉంది... దీనికి చెక్ పెట్టే నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ పనుల సమయంలో 60 రోజులపాటు ఉపాధి పనులను నిలిపివేయనున్నారు... మిగతా 305 రోజుల్లో 125 రోజులు కూలీలకు ఉపాధి కల్పించనున్నారు. దీంతో రైతులకు కూలీల కొరత ఉండదు... కూలీలకు ఎక్కువరోజులు పని కల్పించినట్లు అవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories