ఆల్క‌హాల్ నిషేధంతో స‌మాజంలో ఎలాంటి మార్పులు వ‌స్తాయి.? ఐఐటీ అధ్య‌య‌నంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు

Published : Jan 20, 2026, 10:34 AM IST

Liquor ban: ఆల్క‌హాల్ ఆరోగ్యానికి హానిక‌ర‌మ‌ని తెలిసిందే. అయినా మందు బాబులు ఆ అల‌వాటు మార్చుకోరు. అయితే దేశంలో ప‌లు చోట్ల ఆల్క‌హాల్ నిషేధం అమ‌ల్లో ఉన్న విష‌యం తెలిసిందే. ఇంత‌కీ మందు నిషేధిస్తే స‌మాజంలో ఏం జ‌రుగుతుందో తెలుసా.? 

PREV
15
ఆల్క‌హాల్ నిషేధం తర్వాత ఆహారపు అలవాట్లలో స్పష్టమైన మార్పు

బీహార్‌లో 2016లో అమలులోకి వచ్చిన సంపూర్ణ ఆల్క‌హాల్‌ నిషేధం ప్రజల జీవనశైలిని గణనీయంగా మార్చింది. ఈ నిర్ణయం వల్ల ఆల్క‌హాల్‌ వినియోగం తగ్గడమే కాకుండా, ప్రజలు తినే ఆహారంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకున్నాయని ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు గుర్తించారు. రోజువారీ ఆహారంలో శక్తి ఇచ్చే కేలరీలు, శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వుల వినియోగం స్పష్టంగా పెరిగినట్లు అధ్యయనం వెల్లడించింది.

25
పోషకాహారంపై పెరిగిన ఖర్చు

ఆల్క‌హాల్‌కు ఖర్చయ్యే డబ్బు తగ్గడంతో కుటుంబాలు ఆ మొత్తాన్ని ఆహారంపై వెచ్చించడం మొదలుపెట్టాయి. పప్పుధాన్యాలు, పాల పదార్థాలు, నాణ్యమైన వంట నూనెల వాడకం ఎక్కువైంది. గింజల నుంచి తీసిన నూనెల వైపు ప్రజలు మొగ్గు చూపడం వల్ల ఆహార నాణ్యత మెరుగుపడింది. సాధారణంగా ధాన్యాలపైనే ఆధారపడే బీహార్ లాంటి రాష్ట్రంలో ఈ మార్పు పాలసీ పరంగా కీలకంగా మారింది.

35
జంక్ ఫుడ్ వినియోగం త‌గ్గింది

ఆల్క‌హాల్‌తో పాటు సాధారణంగా తీసుకునే ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం కూడా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ఆల్కహాల్ దూరమవడంతో అనారోగ్యకరమైన ప్యాకేజ్డ్ ఫుడ్ పట్ల ఆసక్తి తగ్గింది. దాంతో సహజ ఆహార పదార్థాల వినియోగం పెరిగింది. ఇది దీర్ఘకాలిక ఆరోగ్యానికి అనుకూలంగా మారిందని అధ్యయనం చెబుతోంది.

45
అధ్యయనం ఎలా చేశారు?

ఈ పరిశోధన కోసం నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ 2011-12, 2022-23 కాలాల్లో సేకరించిన వినియోగదారుల ఖర్చు వివరాలను విశ్లేషించారు. కాలానుగుణ మార్పులు స్పష్టంగా తెలుసుకునేందుకు బీహార్‌ను ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పోల్చి పరిశీలించారు. ఫలితాలు కచ్చితంగా ఉండేలా బహుళ గణాంక పద్ధతులు వినియోగించి పలు స్థాయిల్లో తనిఖీలు చేశారు.

55
సామాజిక స్థిరత్వానికి దారి తీసిన విధానం

ఈ నిషేధం కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా, ఇంట్లో స్థిరత్వాన్ని పెంచిందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఆల్కహాల్ తగ్గడంతో కుటుంబ కలహాలు తగ్గాయి. ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి పెరిగింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో, నిషేధం కఠినంగా అమలవుతున్న చోట ఈ మార్పులు మరింత స్పష్టంగా కనిపించాయి. ఆల్క‌హాల్‌తో వచ్చే సామాజిక సమస్యలను తగ్గించాలన్న లక్ష్యంతో తీసుకున్న నిర్ణయం అనుకోని విధంగా ప్రజల ఆరోగ్యానికి కూడా మేలు చేసిందని ఐఐటీ కాన్పూర్ అధ్యయనం స్పష్టం చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories