వివాహితతో ప్రేమాయణం .. ఓయోకి తీసుకెళ్లి మరీ ఎందుకు చంపాడో తెలుసా?

Published : Jun 09, 2025, 09:10 PM ISTUpdated : Jun 09, 2025, 09:31 PM IST

బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన ప్రియురాలిని ఓయో హోటల్‌ కు తీసుకెళ్లి హత్య చేశాడు. కెంగేరికి చెందిన యశస్, హరిణికి జాతరలో పరిచయమై, ప్రేమలో పడ్డారు. ఇలా ప్రేమించిన మహిళను ఎందుకు హత్యచేసాడు? 

PREV
15
బెంగళూరులో కిరాతకం

బెంగళూరులో దారుణం వెలుగుచూసింది. ఓయోకు తీసుకెళ్లిన ప్రియురాలిని అతి కిరాతకంగా హత్యచేసాడో టెకీ. కొన్ని నెలల క్రితం పరిచయమైన ప్రియురాలితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. మృతురాలిని హరిణి (36) గా గుర్తించారు… నిందితుడు యశస్ (25). ఇద్దరూ కెంగేరికి చెందినవారే. పూర్ణ ప్రజ్ఞ లేఅవుట్‌లోని ఓయో హోటల్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది.

25
వివాహితతో టెకీ పరిచయం ఎలా జరిగింది?

కెంగేరిలో నివసించే హరిణి, దాసేగౌడ దంపతుల జీవితంలో జాతర విషాదం నింపింది. కొన్ని నెలల క్రితం స్థానికంగా జరిగిన ఓ సామూహిక వేడుకలో హరిణి కుటుంబంతో సహా వెళ్ళింది. అక్కడే టెకీ యశస్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. 

ఇద్దరిమధ్య పరిచయం ఏర్పడి ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. మొదటి వీరు స్నేహం  పెంచుకున్నారు… చాటింగ్ కాస్త డేటింగ్‌గా మారింది… చివరకు ఈ పరిచయం కాస్త ఇద్దరిమధ్య శారీరక సంబంధానికి దారితీసింది. 

35
దంపతుల మధ్య గొడవ

ఇలా తనకు పరిచయమైన ప్రియుడిని తరచూ కలుసుకోవడం, ఫోన్‌లో మాట్లాడటం చేసేది హరిణి. కొంతకాలం వీరి వ్యవహారం గుట్టుగానే సాగింది… కానీ చివరకు ఈ విషయం హరిణి భర్త దాసేగౌడకు తెలిసింది. దీంతో భార్య ఫోన్ లాక్కుని కట్టడిచేసాడు. దీంతో కొంతకాలం హరిణి, యశస్ మధ్య మాటలు సాగలేవు. 

అయితే కొన్ని నెలల తర్వాత భర్తను క్షమించమని వేడుకుంది హరిణి. ఇకపై ఇలాంటివి చేయనని చెప్పడంతో అతడు నమ్మాడు. భార్యకు ఫోన్ ఇచ్చాడు… కానీ ప్రియుడిని మర్చిపోలేక మళ్ళీ యశస్‌ను సంప్రదించింది హరిణి. 

45
హరిణి హత్యకు యశస్ కుట్ర...

హరిణి తనకు దూరం కావడంతో యశస్  తీవ్ర వేదనకు గురయ్యాడు. దీంతో ప్రియురాలిపై ప్రేమ కాస్త కోపంగా మారింది. ఇదే సమయంలో హరిణి మళ్లీ టచ్ లోకి రావడంతో ఆమె హత్యకు ప్లాన్ చేసాడు యశస్. 

హరిణి కోసం రాయల్స్ హోటల్‌లో రూమ్ బుక్ చేసాడు. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి రూంలోకి వెళ్లాక ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం కత్తితో హరిణిపై దాడిచేసాడు. పలుమార్లు  కత్తితో పొడవడంతో హరిణి అక్కడిక్కడే కుప్పకూలింది… ఆమె చనిపోయిందని నిర్ణయించుకున్న అతడు పరారయ్యాడు. 

55
యశస్ అరెస్ట్

 ఘటనా స్థలానికి చేరుకున్న సుబ్రమణ్యపుర ఇన్‌స్పెక్టర్ రాజు, ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం ఆధారాలు సేకరించారు. నిందితుడు యశస్‌ను అరెస్ట్ చేశారు. తనతో అక్రమ సంబంధం ఉందని, భర్తకు తెలియడంతో తనను దూరం పెట్టిందని, అందుకే హత్య చేశానని యశస్ ఒప్పుకున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories