Cyber Crime: రోజు రోజుకు టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతోందో.. సమస్యలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. మోసం చేయడానికి కొత్త కొత్త దారులు వెతుక్కుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ముంబైలో జరిగిన ఓ సైబర్ స్కామ్ ఇప్పుడు దేశాన్నే కుదిపేస్తోంది.
ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. ఆశ చూపి ఒకరు… భయపెట్టి మరొకరు.. జనాలను దోచుకుంటూనే ఉన్నారు. గతంలో చదువులేని వారినే లక్ష్యంగా పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు చదువుకున్నవాళ్లు, ఎంతో తెలివైన వారు కూడా వీరి వలలో చిక్కుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన ఓ ఘటన దేశాన్నే కుదిపేస్తోంది.
24
రూ.58 కోట్లు దోచుకున్న కేటుగాళ్లు
ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్త దగ్గర ఏకంగా 58 కోట్ల రూపాయలను దోచుకున్నారు సైబర్ కేటుగాళ్లు. డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరించి ఈ దోపిడీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దేశంలో జరిగిన అతిపెద్ద డిజిటల్ అరెస్ట్ కేసు ఇదేనని సమాచారం.
34
ఏం జరిగిందంటే?
ముగ్గురు నిందితులు సీబీఐ, ఈడీ అధికారులుగా నటిస్తూ వ్యాపారవేత్తకు వీడియో కాల్స్ చేేసేవారు. మనీలాండరింగ్ నేరం కింద అతన్ని, అతని భార్యను డిజిటల్ అరెస్టు చేస్తామని బెదిరించారు. కొన్ని నకిలీ పత్రాలు సృష్టించి.. మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు జరుగుతోందని బాధితుడిని నమ్మించి మోసం చేశారు. అంతేకాదు ప్రభుత్వ అధికారులమని చెప్పుకునేందుకు వీరు నకిలీ గుర్తింపు కార్డులను కూడా ఉపయోగించారు.
ఈ మోసగాళ్లు బాధితుడిని మొదట ఆగస్టులో సంప్రదించారు. అప్పటి నుంచి ఈ మోసం కొనసాగుతోంది. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వ్యాపారవేత్తను డిజిటల్ అరెస్టు చేసి అతని ఆస్తి, డబ్బు మొత్తాన్ని జప్తు చేస్తామని బెదిరించడంతో నిందితులకు రూ. 58 కోట్ల వరకు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల ఒక్కొక్కరి వ్యక్తిగత ఖాతాల్లో రూ. 25 లక్షలు వరకు ఉన్నట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ముఠా పరిధి చాలా పెద్దదని.. దీని నెట్‌వర్క్ ఇతర దేశాల్లో కూడా విస్తరించి ఉండే అవకాశం ఉందని అభిప్రాయ వ్యక్తంచేశారు.