Marriage: పెళ్లి చేసుకునే జంట‌ల‌కు రూ. 5 ల‌క్ష‌ల ఆర్థిక సాయం.. కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

Published : Aug 11, 2026, 02:39 PM IST

Marriage: కుల వివక్షను తగ్గించి సమాజంలో సమానత్వం, సామాజిక సామరస్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగా అర్హులైన కులాంతర వివాహం చేసుకున్న జంటలకు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వ‌ర‌కు సాయం అందించ‌నుంది.

PREV
15
ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది.?

ఈ ఆర్థిక సాయం పొందాలంటే భార్య లేదా భర్తలో ఒకరు షెడ్యూల్డ్ కాస్ట్ (SC) వర్గానికి చెందినవారై ఉండాలి. మరొకరు SC వర్గానికి చెందని వ్యక్తి అయి ఉండాలి. అంటే జనరల్ లేదా OBC వంటి ఇతర వర్గాలకు చెందిన వ్యక్తితో వివాహం జరిగి ఉండాలి. అదే సమయంలో ఈ వివాహం ఇద్దరికీ మొదటి వివాహం అయి ఉండాలి. భార్య లేదా భర్తలో ఎవరైనా గతంలో వివాహం చేసుకుని ఉంటే, ఈ పథకం కింద ప్రయోజనం పొందే అవకాశం ఉండదు.

25
వివాహం తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి

ప్రభుత్వ ఆర్థిక సాయం పొందాలంటే కులాంతర వివాహం చట్టబద్ధంగా రిజిస్టర్ అయి ఉండటం తప్పనిసరి. వివాహాన్ని హిందూ మ్యారేజ్ యాక్ట్, 1955 లేదా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద నమోదు చేసుకోవాలి. వివాహ ధ్రువీకరణ పత్రం లేకుండా ప‌థ‌కానికి అప్లై చేసుకునే అవకాశం ఉండదు. అందువల్ల వివాహం జరిగిన తర్వాత సంబంధిత అధికారుల వద్ద వివాహాన్ని అధికారికంగా న‌మోదు చేసుకోవాలి.

35
ఎప్పటిలోపు దరఖాస్తు చేయాలి?

కులాంతర వివాహం జరిగిన తేదీ నుంచి ఒక ఏడాదిలోపు సంబంధిత పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఏడాది గడువు పూర్తయిన తర్వాత దరఖాస్తు చేస్తే స్వీకరించకపోవచ్చు. అందువల్ల అర్హత ఉన్న జంటలు వివాహం జరిగిన వెంటనే అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుని దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడం మంచిది.

45
ఎంత ఆర్థిక సాయం లభిస్తుంది?

కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు కేంద్రంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నాయి. వీటి కింద అందించే ఆర్థిక సాయం రాష్ట్రాన్ని బట్టి మారుతుంది. కొన్ని ప్రాంతాల్లో రూ.50 వేల నుంచి ప్రారంభమయ్యే సాయం ఉండగా, కొన్ని రాష్ట్రాల్లో అర్హులైన జంటలకు రూ.5 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనం లభించే అవకాశం ఉంది. అయితే రూ.5 లక్షలు ప్రతి జంటకు తప్పనిసరిగా లభిస్తాయని భావించకూడదు. సాయం మొత్తం, అర్హతలు, దరఖాస్తు విధానం ఆయా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలపై ఆధారపడి ఉంటాయి.

55
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

అర్హత ఉన్న జంటలు తమ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ (Social Welfare Department) ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం లేదా సంబంధిత అధికారిక సంస్థల ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఉద్దేశంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సోషల్ ఇంటిగ్రేషన్ స్కీమ్ వంటి కార్యక్రమాలను అమలు చేసింది. అలాగే ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు తమ సొంత కులాంతర వివాహ ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తున్నాయి. అందువల్ల దరఖాస్తు చేసుకునే ముందు మీ రాష్ట్రంలో అమలులో ఉన్న పథకం, అర్హతలు, అవసరమైన పత్రాలు, సాయం మొత్తం గురించి సంబంధిత సాంఘిక సంక్షేమ శాఖ అధికారిక సమాచారం తెలుసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories