LuLu Group: రూ. 3 వేల కోట్లతో లూలూ గ్రూప్ దేశంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్.. ఎక్కడో తెలుసా.?

Published : Apr 20, 2025, 02:04 PM IST

భారీ షాపింగ్ మాల్స్ కి పెట్టింది పేరు లూలూ గ్రూప్. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో లూలూ గ్రూప్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ను నిర్మించిన విషయం తెలిసిందే. మన దేశంలో కూడా ఈ గ్రూప్  ఆధ్వర్యంలో చాలా నగరాల్లో షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అయితే తాజాగా భారత దేశంలో మరో భారీ షాపింగ్ మాల్ ఏర్పాటుకు లూలు గ్రూప్ సిద్ధమైంది. ఏకంగా రూ. 3000 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. దేశంలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ గా చెప్పుకుంటున్న ఆ మాల్ ఏ నగరంలో రానుంది.? దాని విశేషాలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం.. 

PREV
14
LuLu Group: రూ. 3 వేల కోట్లతో లూలూ గ్రూప్ దేశంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్.. ఎక్కడో తెలుసా.?
లూలూ మాల్

యుఏఈకి చెందిన బిలియనీర్ యూసుఫ్ అలీకి చెందిన లూలూ గ్రూప్ ఇంటర్నేషనల్, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో భారతదేశంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్‌ను నిర్మిస్తోంది. దీనికోసం రూ.3,000 కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఇది పూర్తి అయితే దేశంలోనే అతి పెద్ద మాల్ కానుంది. 

24

18 వేల ఉద్యోగాలు:

లూలూ గ్రూప్ భారీ షాపింగ్ మాల్ ప్రాజెక్ట్ 18,000 ఉద్యోగాలను సృష్టించనుంది. గుజరాత్ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

34
లూలూ గ్రూప్ వి. నందకుమార్

అత్యాధునిక సౌకర్యాలు:

అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ షాపింగ్ మాల్ నిర్మాణం వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలవుతుందని లూలూ గ్రూప్ మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ వి. నందకుమార్ ధ్రువీకరించారు. "భారతదేశంలో అత్యంత వృద్ధి చెందుతున్న షాపింగ్ గమ్యస్థానంగా అహ్మదాబాద్‌ను మార్చాలనేది మా లక్ష్యం. ఈ షాపింగ్ మాల్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక మైలురాయిగా నిలుస్తుంది" అని నందకుమార్ అన్నారు.

44
అహ్మదాబాద్ లూలూ మాల్ ప్రాజెక్ట్

300+ బ్రాండ్‌లు:

ఈ మెగా మాల్‌లో 300+ అంతర్జాతీయ, భారతీయ బ్రాండ్‌లు ఉంటాయి. 15 స్క్రీన్ల ఐమాక్స్ మల్టీప్లెక్స్, 3,000 మంది కూర్చునే ఫుడ్ కోర్ట్, భారతదేశంలోనే అతిపెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ జోన్ ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories