హర్షిత కేజ్రీవాల్ ఏం చేస్తుంది?
హర్షిత కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్, సునీత దంపతులకు కూతురు హర్షిత, కొడుకు పుల్కిత్ సంతానం. కేజ్రీవాల్ మాదిరిగానే ఆయన ఇద్దరు పిల్లలు ఐఐటియన్లే. పెద్దకూతురు హర్షిత ఇప్పటికే ఐఐటి డిల్లీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసింది...పుల్కిత్ ప్రస్తుతం ఇదే ఐఐటీలో చదువుకుంటున్నాడు.
ఐఐటీ ఢిల్లీలో చదువుతున్నప్పుడే హర్షితకు సంభవ్ జైన్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మనసులు కలవడంతో ప్రేమించుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ జీవితంలో స్థిరపడటంతో పెద్దలు కూడా వీరి ప్రేమను కాదనలేకపోయారు. ఇలా పెద్దలను ఒప్పించి హర్షిత, సంభవ్ పెళ్లి చేసుకున్నారు.
ఐఐటీ తర్వాత హర్షిత ఉద్యోగంలో చేరిపోయారు. గురుగ్రామ్ లోని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ లో అసోసియేట్ కన్సల్టెంట్ గా పనిచేసారు. అలాగే కాబోయే భర్తతో కలిసి ఓ స్టార్టప్ ను కూడా స్థాపించారు. ప్రస్తుతం ఇది సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.
కేవలం చదువులోనే కాదు ఇతర విషయాల్లోనూ హర్షిత బాగా చురుకు. ఆమె ఒడిస్సి నాట్యం నేర్చుకుంది. ఇక హింది,ఇంగ్లీష్ తో పాటు ఫ్రెంచ్ అనర్గళంగా మాట్లాడగలరు. ఇవి కాకుండా రాజకీయాల్లోనూ తండ్రికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇటీవల ఆప్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం కూడా చేపట్టారు.