LPG Fraud : సిలిండర్ పేరుతో కొత్త మోసం..: Indane, HP కస్టమర్లు బిఅలర్ట్

Published : May 11, 2026, 03:06 PM IST

LPG సిలిండర్ డెలివరీ అథెంటికేషన్ కోడ్ (DAC) పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో Indane, HP గ్యాస్ కంపెనీలు తమ కస్టమర్లను అప్రమత్తం చేస్తున్నాయి.

PREV
14
LPG DAC అంటే ఏమిటి..?

ఇప్పుడు 100% గ్యాస్ సిలిండర్ డెలివరీలు DAC (డెలివరీ అథెంటికేషన్ కోడ్) ద్వారానే జరుగుతున్నాయి. మీ సిలిండర్‌ను వేరేవాళ్లు తీసుకోకుండా మీ భద్రత కోసం ఈ నిబంధన పెట్టారు. కానీ దీన్నే మోసగాళ్లు ఆయుధంగా మార్చుకున్నారు.

'మీ సిలిండర్ రద్దు అవుతుంది', 'మీ సబ్సిడీ ఆగిపోతుంది, ఈ లింక్‌లో కోడ్ ఎంటర్ చేయండి' అంటూ ప్రాడ్ మెసేజ్‌లు పంపుతూ కస్టమర్లను దోచుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. ఇలాంటివి నమ్మొద్దని గ్యాస్ సప్లై కంపెనీలు సూచిస్తున్నాయి.

24
అసలు, నకిలీ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి?

హెచ్పి గ్యాస్ నుంచి వచ్చే అధికారిక మెసేజ్‌లు ఎప్పుడూ 'VM-HPGASc-S' లాంటి సెండర్ పేరుతో వస్తాయి. అందులో 4-అంకెల OTP ఉంటుంది. HP ఉద్యోగులు ఫోన్ లేదా వాట్సాప్‌లో OTP అడగరని గుర్తుంచుకోండి. ఇక Indane మెసేజ్‌లు 'VK-INDANE' లేదా 'VM-INDANE' ఐడీతో వస్తాయి. ఇందులో 6-అంకెల DAC కోడ్ ఉంటుంది.

34
గ్యాస్ సిలిండర్ డెలివరీకి DAC కోడ్‌ను ఎప్పుడు ఇవ్వాలి..?
మీకు వచ్చే 4-అంకెల OTP అయినా, 6-అంకెల DAC కోడ్ అయినా సరే... సిలిండర్ తీసుకుని మీ ఇంటికి వచ్చే డెలివరీ పర్సన్‌కు మాత్రమే చెప్పాలి. అంతకుముందు ఫోన్‌లో ఎవరితోనూ ఈ నంబర్‌ను అస్సలు పంచుకోవద్దు.
44
LPG సిలిండర్ డెలివరీపై సైబర్ నిపుణుల సలహా..
మీరు సిలిండర్ బుక్ చేయకపోయినా డెలివరీ లేదా కోడ్ గురించి మెసేజ్ వస్తే, వెంటనే దాన్ని డిలీట్ చేయండి. 'ఇప్పుడే కోడ్ చెప్పండి, లేదంటే బుకింగ్ క్యాన్సిల్ అవుతుంది' అని ఎవరైనా ఫోన్‌లో బెదిరిస్తే, వాళ్లు కచ్చితంగా మోసగాళ్లని అర్థం చేసుకోండి. మీకు తెలియని ఏ లింక్‌ల ద్వారా మీ బుకింగ్ వివరాలను షేర్ చేయకండి.
Read more Photos on
click me!

Recommended Stories