Gas Stove: గ్యాస్ స్టవ్ మంట తక్కువగా వస్తోందా? ఇలా చేసి చూడండి
life Apr 08 2026
Author: ramya Sridhar Image Credits:Getty
Telugu
స్టాప్లర్ పిన్స్ ఉంటే చాలు...
స్టవ్ బర్నర్ నుంచి మంట సరిగా రాకపోతే.. మీ దగ్గర స్టాప్లర్ పిన్ కానీ, ఏదైనా సన్నని తీగ ఉంటే చాలు. స్టాప్లర్ పిన్ ని నిటారుగా చేసుకోవాలి.
Image credits: IndiaMART
Telugu
ముందు గ్యాస్ ఆఫ్ చేయండి
మొట్టమొదట భద్రత ముఖ్యం. అందుకే, ముందుగా సిలిండర్ రెగ్యులేటర్‌ను ఆఫ్ చేయండి.
Image credits: flipkart
Telugu
పిన్‌ను రెడీ చేసుకోండి
స్టేప్లర్ పిన్‌ను నోస్ ప్లయర్‌తో పట్టుకుని, దాన్ని నిటారుగా చేయండి. అది ఒక చిన్న సూదిలా తయారవుతుంది.
Image credits: amazon
Telugu
నాజిల్‌ను క్లీన్ చేయండి
బర్నర్‌ను తీసి, స్టవ్‌ను వెనక్కి తిప్పండి. అక్కడ గ్యాస్ వచ్చే చిన్న రంధ్రం (నాజిల్) కనిపిస్తుంది. ఆ రంధ్రంలోకి మీరు సిద్ధం చేసుకున్న పిన్‌ను పెట్టి 3-4 సార్లు కదిలించండి.
Image credits: flipkart
Telugu
ఇప్పుడు చెక్ చేయండి
ఇప్పుడు స్టవ్‌ను మళ్లీ యథావిధిగా పెట్టి, బర్నర్‌ను అమర్చండి. గ్యాస్ ఆన్ చేసి స్టవ్ వెలిగించి చూడండి. మంట మునుపటి కంటే కచ్చితంగా ఎక్కువగా వస్తుంది!
Image credits: Getty
Telugu
ఒక చిన్న సలహా
ఈ పని చేసేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి, నిదానంగా ప్రయత్నించండి. ఒకవేళ మీకు ధైర్యం లేకపోయినా, లేదా నాజిల్ రంధ్రం మరీ గట్టిగా మూసుకుపోయినా.. నిపుణుల సహాయం తీసుకోవడం ఉత్తమం.