Law: పెళ్లైన వ్య‌క్తి మ‌రో మ‌హిళ‌తో క‌లిసి ఉండ‌డం త‌ప్పు కాదా.? హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

Published : Apr 02, 2026, 05:20 PM IST

Law: భారతీయ సమాజంలో పెళ్లిని చాలా పవిత్రమైన బంధంగా భావిస్తారు. కానీ మారుతున్న కాలంతో పాటు చట్టపరమైన అభిప్రాయాలు కూడా కొంత మారాయి. ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఒక కేసు విచారణ సమయంలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. 

PREV
14
అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్య

అలహాబాద్ హైకోర్టు ఒక కేసు విచారణలో కీల‌క విష‌యాన్ని ప్ర‌స్తావించింది. ఒక వివాహిత పురుషుడు, ఒక మహిళ ఇద్దరూ పరస్పర సమ్మతితో కలిసి లివ్-ఇన్ రిలేషన్‌లో ఉంటే అది నేరంగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది. చట్టం ప్రకారం అది నేరం కాద‌ని, కేవలం సామాజిక నైతికత ఆధారంగా దాన్ని శిక్షించలేము. చట్టంతో పాటు సమాజపు అభిప్రాయాలు రెండు వేర్వేరు అంశాలు అని కూడా కోర్టు స్పష్టం చేసింది.

24
ఈ కేసు ఎలా ప్రారంభమైంది?

ఈ కేసు ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాకు చెందినది. ఒక మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక వివాహిత పురుషుడు ఆమెను మోసం చేసి తీసుకెళ్లాడని వారు ఆరోపించారు. కానీ కోర్టులో వారిద్ద‌రు తాము మేజ‌ర్స్ అని, ఇద్ద‌రూ ఇష్ట‌పూర్వ‌కంగానే కలిసి జీవిస్తున్నామ‌ని తెలిపారు. అదే సమయంలో ఆ మహిళ తన కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని కూడా కోర్టుకు తెలిపింది. దీనిని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు తాత్కాలికంగా వారికి రక్షణ ఇచ్చింది. అలాగే పోలీసులకు వారి భద్రతను కల్పించాలని ఆదేశించింది.

34
చట్టం ఏమంటోంది?

ఇంతకుముందు ఇండియ‌న్ పీన‌ల్ కోర్ట్ లో 497 యాక్ట్‌ ప్రకారం ప్రాస్టిట్యూషన్  నేరంగా పరిగణించేవారు. అంటే పెళ్లి అయిన వ్యక్తి మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే కేసు నమోదు చేసే అవకాశం ఉండేది. అయితే ఈ చట్టంపై చాలా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఇది మహిళలను భర్తకు చెందిన ఆస్తిలా చూస్తుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 2018లో జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఈ 158 సంవత్సరాల పాత చట్టాన్ని రద్దు చేసింది. ఇద్దరు పెద్దల మధ్య పరస్పర సమ్మతితో ఏర్పడిన సంబంధాన్ని నేరంగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది. భర్తపై విడాకులు కోరే హక్కు, భరణం (Maintenance) కోరే అవకాశం, కుటుంబ చట్టాల ప్రకారం న్యాయ పరిరక్షణ, అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే… విడాకులు తీసుకోకుండా మరో మహిళను పెళ్లి చేసుకోవడం మాత్రం ఇప్పటికీ చట్ట విరుద్ధం.

44
కొత్త చట్టం BNS ప్రకారం పరిస్థితి

కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS)లో కూడా ప్రాస్టిట్యూషన్ నేరంగా చేర్చలేదు. అంటే పరస్పర సమ్మతితో ఉన్న లివ్-ఇన్ సంబంధాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసే నిబంధన లేదు. కానీ కొన్ని పరిస్థితుల్లో మాత్రం చట్టం వర్తిస్తుంది. ఉదాహరణకు మహిళను మోసం చేసి తీసుకెళ్లడం, బలవంతంగా సంబంధం పెట్టుకోవడం, బెదిరింపులు లేదా మానసిక ఒత్తిడి వంటి సందర్భాల్లో BNS ధారా 87 వంటి సెక్షన్లు వర్తించవచ్చు. ఈ కేసుల్లో 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా పడే అవకాశం ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories