Jayalalitha Assets: దివంగత నేత, తమిళనాడు మాజీ సీఎం జయలలిత చనిపోయినా...ఆమె ఆస్తుల గొడవ ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. దానికి సంబంధించిన విషయంపై ఏదో ఒక్క రచ్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు మళ్లీ మరో ఆస్తి వివాదం బయటపడింది.
దివంగత నేత, తమిళనాడు మాజీ సీఎం జయలలిత చనిపోయినా...ఆమె ఆస్తుల గొడవ ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. దానికి సంబంధించిన విషయంపై ఏదో ఒక్క రచ్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు మళ్లీ మరో ఆస్తి వివాదం బయటపడింది.
హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో జయలలిత పేరు మీద ఉన్న భవనాన్ని GHMC అధికారులు జప్తు చేశారు. ఆస్తి పన్ను బకాయిలు 2017 నుంచి చెల్లించకపోవడంతో సీల్ చేశారు. గతంలో జయలలితకు సంబంధించిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రూ.83 లక్షలు బకాయిలు ఉండిపోయినట్లు తెలుస్తోంది.
25
విజయ్ మాల్యాకు భవనం లీజుకు
అయితే ఇది నివాస భవనమే అయినా...విజయ్ మాల్యాకు చెందిన కంపెనీకి లీజుకివ్వడంతో క మర్షియల్ కేటగిరిలోకి మారింది. కానీ ఆ కంపెనీ 2017లోనే భవనాన్ని ఖాళీ చేసేసింది. మొత్తం కోటి 60 లక్షలున్న ఆస్తి పన్నును...వన్ టైమ్ సెటిల్‌మెంట్ పథకం ప్రకారం వడ్డీ మాఫీ చేసి ₹83 లక్షలకు తగ్గింది.
35
ఓనర్స్ ఎవరూ లేరు..అంతా కేర్ టేకర్సే
తమిళనాడుకు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత ఇంటిని ఇలా సీజ్ చేయడం తమిళ ప్రజలను షాక్‌కు గురిచేసింది. అయితే సాయంత్రానికి ఇంటిని సీజ్ తీసేశారు. టైం ఇస్తే త్వరలో కడతామని బిల్డింగ్ కేర్ టేకర్ చెబుతున్నారు. ఈ ఇంటికి ఓనర్స్ ఎవరూ లేరని హైదరాబాద్ శ్రీనగర్ బిల్డింగ్ కేర్ టేకర్ తెలిపారు. ఉన్నవాళ్లు ఎవరైనా సరే దీపక్, దీప, శశికళ అయినా కూడా కేర్ టేకర్స్ మాత్రమేనని చెబుతున్నారు. హైదరాబాద్ లో ఉన్న ఆస్తులు తానే చూస్తానని ఆయన తెలిపారు.
జయలలిత తన ఆస్తులపై ఎలాంటి వీలునామా రాయకపోవడంతో అసలు చిక్కొచ్చింది. అయితే జయలలిత మేనల్లుడు, మేనకోడలు దీపక్, దీపలను చట్టబద్ధ వారసులుగా కోర్టు తీర్పిచ్చింది. కానీ ఆస్తి బదిలీ ప్రక్రియ జరగలేదు. దానికితోటు ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. భవనం సీజ్ చేసిన విషయం తెలియడంతో వారసులు స్పందించి బకాయిలను క్లియర్ చేస్తామని చెప్పడంతో భవనానికి వేసిన సీల్ తొలగించారు. అయితే మొత్తం మీద హైదరాబాద్ లో జయలలితకు ఈ పెద్ద భవనంతో పాటు జీడిమెట్లలో ద్రాక్షతోట మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.
55
జయలలిత ఆస్తుల విలువ రూ.4వేల కోట్లకుపైనే!
మరోవైపు, జయలలిత మొత్తం ఆస్తుల విలువపై కూడా అనేక అంచనాలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ప్రకటించిన ఆస్తులు సుమారు రూ.113 కోట్ల వరకు ఉన్నప్పటికీ, ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఇవి వేల కోట్లకు చేరవచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో ఉన్న ఆస్తుల విలువ భారీగా పెరగడంతో మొత్తం విలువ రూ.4000 కోట్లకు పైగా ఉండొచ్చన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇవి అధికారికంగా నిర్ధారించబడిన సంఖ్యలు కావు.
మొత్తంగా చూస్తే, జయలలిత ఆస్తులపై స్పష్టత లేకపోవడం, వారసత్వ బదిలీ పూర్తికాకపోవడం వల్ల ఇలాంటి వివాదాలు తరచూ బయటపడుతున్నాయి. ఈ సమస్యకు పూర్తి పరిష్కారం రావాలంటే చట్టపరమైన ప్రక్రియలు వేగంగా పూర్తి కావాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అప్పటివరకు ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.