coronavirus: కరోనా కొత్త వేరియంట్ విజృంభ‌ణ‌.. లక్షణాలు ఎలా ఉంటాయంటే?

Published : May 20, 2025, 09:20 PM IST

Symptoms of JN.1 variant of coronavirus: జనవరి 2024లోనే భారత్‌లో జేఎన్.1 కోవిడ్ సబ్-వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు సింగపూర్, హాంకాంగ్‌లో వాటి ప్రభావం పెరుగుతోంది. భారత్ లో కూడా ఈ రకం కేసులపై ప్రభుత్వం అలర్ట్ అయింది.  

PREV
16
మళ్లీ పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు

Corona virus new variant symptoms: ప్రస్తుతం పలు దేశాల్లో మళ్లీ కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. భారత్ లో కూడా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. మళ్లీ కరోనా వ్యాప్తి వెనుక జేఎన్.1 కోవిడ్ వేరియంట్ ఉందని వైద్య నిపుణులు గుర్తించారు.

26
జేఎన్.1 కోవిడ్ వేరియంట్ కేసులే కారణమా?

జేఎన్.1 కోవిడ్ వేరియంట్ కేసులు భారతదేశంలోనూ నమోదయ్యాయనీ, వీటిని జనవరి 2024లోనే గుర్తించినట్టు నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో ఇదే వేరియంట్ వల్ల కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే తాజాగా ముంబయిలో నమోదైన కేసులు ఏ వేరియంట్‌కు చెందినవో ఇంకా స్పష్టత రాలేదు. కానీ, కోవిడ్ పెరుగుదలపై ప్రభుత్వం అలర్ట్ గా ఉంది.

36
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం, జేఎన్.1 అనేది BA.2.86 అనే సబ్-వేరియంట్‌కు చెందిన మరో ఉప-వేరియంట్. ఇందులో అదనంగా ఒక మ్యూటేషన్ ఉందని, దాని వల్ల ఇది చాలా వేగంగా వ్యాపించే అవకాశముందని పేర్కొంది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

46
ఢిల్లీలో జేఎన్.1 వేరియంట్ కేసు

2024 జనవరిలో ఢిల్లీలో జేఎన్.1 వేరియంట్ కేసు వెలుగులోకి వచ్చినప్పుడు, ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రి అధికారులు కొన్ని ముఖ్యమైన కోవిడ్ లక్షణాలపై ప్రజలను హెచ్చరించారు. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

వైద్య నిపుణులు తెలిపినట్లు, భారత ప్రజలకు ముందే కోవిడ్ వ్యాక్సిన్ డోసులు, బూస్టర్ డోసులు అందిన కారణంగా ప్రతి వ్యక్తిలో వేరియంట్ లక్షణాలు భిన్నంగా కనిపించే అవకాశం ఉంది. వ్యాక్సినేషన్ వల్ల వచ్చిన ఇమ్యూనిటీ ఆధారంగా లక్షణాల తీవ్రత మారవచ్చని వారు తెలిపారు.

56
CDC హెచ్చరికలు.. జేఎన్.1 వేరియంట్‌ లక్షణాలు ఇవే

CDC (Centers for Disease Control and Prevention) డిసెంబర్ 8, 2023న విడుదల చేసిన నివేదిక ప్రకారం, జేఎన్.1 వేరియంట్ వల్ల కలిగే లక్షణాలు వ్యక్తిగత ఇమ్యూనిటీ, ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటాయి.

UK ఆరోగ్య నిపుణుల ప్రకారం జేఎన్.1 వేరియంట్‌కు సంబంధించిన కొన్ని సాధారణ లక్షణాలు ఇలా ఉన్నాయి:

గొంతు నొప్పి, నిద్రలేమి, ఆందోళన (Anxiety), ముక్కు కారడం, దగ్గు, తలనొప్పి, అలసట, శరీర నొప్పులు ఉంటాయి.

66
కోవిడ్ వ్యాప్తి.. పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం

అలాగే, UK వైద్యులు పేర్కొన్నట్లు, దగ్గు, గొంతు నొప్పి, తుమ్ములు, అలసట, తలనొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా నమోదయ్యాయి. ఇవి ఫ్లూ లక్షణాలతో సమానంగా ఉండే అవకాశం ఉన్నందున, పరీక్షలు చేయించుకోవడం ముఖ్యమని తెలిపారు.

కొత్త వేరియంట్ కారణంగా వచ్చే మార్పులపై స్పష్టత ఇవ్వడం కష్టమేనని వైద్య నిపుణులు పేర్కొన్నారు. అయితే, సాధారణ లక్షణాలైన దగ్గు, గొంతు నొప్పి, తుమ్ములు, అలసట, తలనొప్పి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Read more Photos on
click me!

Recommended Stories