Jio Airline : ప్రస్తుతం భారతీయ విమానయాన రంగంలో తీవ్ర అలజడి నెలకొంది. ఇండిగో ఎయిర్ లైన్స్ సంక్షోభంతో విమానయాన వ్యవస్థ కుదేలయ్యింది. వేల సంఖ్యలో విమానాలు రద్దవడంతో మూన్నాలుగు రోజులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు పరిస్థితి చక్కబడిందని ఇటు ఇండిగో, అటు కేంద్ర విమానయాన శాఖ ప్రకటించాయి. కానీ ప్రజల్లో మాత్రం ప్రస్తుత విమానయాన సంస్థలపై ఇంకా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది... కొన్ని మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
25
ఎయిర్ లైన్ బిజినెస్ లోకి జియో..?
ఇండిగో సంక్షోభం నేపథ్యంలో భారతీయ ఎయిర్ లైన్స్ విభాగంలో మంచి అవకాశాలున్నాయనే విషయం బైటపడింది. కేవలం రెండుమూడు విమానయాన సంస్థలే ఈ రంగంలో గుత్తాధిపత్యం ప్రదర్శిస్తున్నాయనేది స్పష్టమయయ్యింది. ఇలాంటి సమయంలో భారతీయ కుభేరుడు ముఖేష్ అంబానీ రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందంటూ ప్రజలు సరదాగా అభిప్రాయపడుతున్నారు. విమానయాన రంగంలో రిలయన్స్ అడుగుపెట్టాలని కోరుకుంటున్నారు.
35
జియో ఎయిర్ లైన్స్... ఫ్రీ జర్నీ?
''రిలయన్స్ జియో ఎయిర్ లైన్స్ ఏర్పాటుకు ఇదే సరైన సమయం... అంబానీ మామా ఆలోచించు. జియో సిమ్ లాగే జియో ఎయిర్ లైన్స్ లో వన్ ఇయర్ ప్రయాణం ఫ్రీ అని ప్రకటించి చూడు. ఇండియాలోని విమానాశ్రయాలు బస్టాండుల్లా... ఎయిర్ బస్సులు కాస్త ఎర్ర బస్సులుగా మారిపోతాయి'' అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక కొందరు మరో అడుగు ముందుకేసి జియో విమానాలను సొంతంగా రెడీ చేసేస్తున్నారు. ఏఐ లేదా ఇతర ఎడిటింగ్ యాప్స్ ఉపయోగించి ''జియో ఎయిర్ లైన్స్'' పేరిట విమానాల ఫోటోలు క్రియేట్ చేశారు. వీటిని సోషల్ మీడియాలో పెట్టి నిజంగానే రిలయన్స్ ఎయిర్ లైన్స్ విభాగంలో అడుగుపెడుతోందని... ఇప్పుడున్న ఎయిర్ లైన్స్ పని అయిపోయినట్లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీని ఆధారంగా మరికొందరు కంటెంట్ క్రియేటర్స్ జియో ఎయిర్ లైన్స్ పై అనేక రకాలు ప్రచారాలు చేస్తున్నారు.
55
నేషన్ వాట్స్ జియో ఎయిర్ లైన్స్...
అయితే ''జియో ఎయిర్ లైన్స్'' పేరిట జరుగుతున్న ప్రచారంపై రిలయన్స్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ ప్రచారాన్ని కొట్టిపారేసి క్లారిటీ ఇవ్వకపోవడంతో జియో ఎయిర్ లైన్స్ వార్తలు, ఫోటోలు మరింతగా సోషల్ మీడియాలో సర్క్యు లేట్ అవుతున్నాయి. ఇండిగో సంక్షోభం ఏమోగాని 'జియో ఎయిర్ లైన్స్' వైరల్ గా మారిపోయింది... 'Nation Wants Jio Airline' కామెంట్స్ తో సోషల్ మీడియా నిండిపోతోంది.