భార‌త్‌-పాక్ ఉద్రిక్త‌త‌ల వేళ‌.. మైసూర్ పాక్ పేరు మార్చేశారు. కొత్త పేరేంటంటే..

Published : May 23, 2025, 06:13 PM ISTUpdated : May 23, 2025, 06:14 PM IST

భార‌త్‌-పాకిస్థాన్‌ల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల ప‌రిస్థితుల వేళ భార‌తీయుల‌కు పాకిస్థాన్‌పై స‌హ‌జంగానే కోపం పెరుగుతోంది. భార‌త్ ఉగ్ర‌వాదుల‌పై దాడి చేస్తే పాకిస్థాన్ మాత్రం సాధార‌ణ పౌరులపై విరుచుకుప‌డింది. అయితే భారత ఆర్మీ దీనికి తగిన సమాధానం చెప్పింది.  

PREV
15
మిఠాయి వ్యాపారి కీల‌క నిర్ణ‌యం:

పాకిస్థాన్ కుతంత్రాల‌కు గ‌ట్టిగా బ‌దులిచ్చిన ఇండియ‌న్ ఆర్మీ స‌రైన స‌మాధానం ఇచ్చింది కాగా. తాజాగా జైపూర్‌లోని ప్రముఖ మిఠాయి దుకాణ యజమాని అంజలీ జైన్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తన దుకాణంలో అమ్మే కొన్ని ప్రసిద్ధ మిఠాయిల పేర్లను మార్చి దేశభక్తిని చాట‌కున్నాడు.

25
‘మైసూర్ పాక్’ పేరు మార్పు

దేశంలో పాకిస్థాన్‌ పట్ల ప్రస్తుతం నెల‌కొన్న వ్య‌తిరేక‌త‌ల నేప‌థ్యంలో అంజలీ జైన్ తన ‘త్యోహార్ స్వీట్స్’ దుకాణంలో కొన్ని మిఠాయిల పేర్లను మార్చారు. అందులో ముఖ్యంగా, ‘మైసూర్ పాక్’ను ‘మైసూర్ శ్రీ’గా మార్చడం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

35
'పాక్' అనే పదం సంస్కృత మూలం:

నిజానికి ‘పాక్’ అనే పదానికి పాకిస్థాన్‌ దేశంతో సంబంధం లేదు. ఇది సంస్కృతములోని ‘పాకం పట్టడం’, ‘వండటం’ అర్థాల నుంచి వచ్చింది. మిఠాయిల తయారీలో ‘పాక్’ అనే పదం చక్కెర లేదా బెల్లంతో చేసిన తీపి పదార్థాలను సూచిస్తుంది. అయితే, పాకిస్థాన్‌ దేశంతో నెల‌కొన్ని ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప్రజల్లో ఆ పదం మీద అసహనం ఏర్పడింది.

45
ఇత‌ర స్వీట్ల పేర్లు కూడా మార్పు

‘మైసూర్ పాక్’ తో పాటు ‘మోతీ పాక్’, ‘ఆమ్ పాక్’, ‘గోండ్ పాక్’, ‘స్వర్ణ భాషం పాక్’, ‘చాందీ భాషం పాక్’ వంటి పేర్లను వరుసగా ‘మోతీ శ్రీ’, ‘ఆమ్ శ్రీ’, ‘గోండ్ శ్రీ’, ‘స్వర్ణ శ్రీ’, ‘చాందీ శ్రీ’గా మార్చారు. ‘శ్రీ’ అనే పదం భారతీయ సంస్కృతిలో శుభం, సౌభాగ్యం సూచించే మాటగా భావిస్తారు.

55
యజమాని అంజలీ జైన్ అభిప్రాయం

త్యోహార్ స్వీట్స్ యజమాని అంజలీ జైన్ మాట్లాడుతూ, "దేశభక్తి కేవలం సైనికులకు మాత్రమే కాకుండా ప్రతి పౌరుడిలోనూ ఉండాలి. దీని కోసం చిన్న చర్యలు తీసుకోవడం అవసరం. మిఠాయిల పేర్ల మార్పు ఈ చిన్న కృషి" అని తెలిపారు.

అంజ‌లీ జైన్ తీసుకున్న నిర్ణ‌యంపై దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. దేశభక్తి భావనను గాఢంగా చాటేందుకు, ప్రజల దృష్టిని ఆకర్షించేలా చిన్న చిన్న చర్యలు తీసుకోవడం అవసరమని అంజలీ జైన్ చెప్పుకొచ్చారు.

Read more Photos on
click me!

Recommended Stories