Vande Mataram: వందేమాతరం గేయానికి నేటితో 150 ఏళ్లు. ఇది మన దేశ హృదయ స్పందన. భారత స్వాతంత్ర్య చరిత్రలో వందేమాతరం గేయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది జాతి గౌరవానికి సంబంధించినది. ఈ మహోన్నత గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయి.
భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో వందేమాతరం ఒక స్ఫూర్తి. ఈ మహోన్నత గేయం నేటితో 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. వందేమాతర గేయాన్ని ఆనాటి జ్ఞాపకాలను ఎంతోమంది గుర్తు చేసుకుంటున్నారు. 1875లో మహాకవి అయిన బంకించంద్ర ఛటోపాధ్యాయ ఈ గేయాన్ని రచించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజల గుండెల్లో దేశభక్తి జ్వాలలను రగిలించేందుకు ఈ గేయాన్ని రచించారు. ఆయన రచించిన ప్రసిద్ధ నవల ఆనందమఠం పుస్తకంలోనే తొలిసారిగా ఈ వందేమాతర గేయం కనిపించింది. నవంబర్ ఏడవ తారీఖున ఆయన ఈ గేయాన్ని రచించారు. మాతృభూమిని శక్తి స్వరూపిణిగా వర్ణించిన గేయం ఇది. బానిసత్వంలో నలిగిపోతున్న భారతీయుల మనసుల్లో స్వేచ్ఛ అనే ఆశకు జీవం పోసింది.
26
రవీంద్రనాథ్ ఠాగూర్ స్వరకల్పన
వందేమాతరం అనే రెండు పదాలు మీకు సాధారణంగా అనిపించవచ్చు. కానీ వాటికి ఉన్న అర్థం ఎంతో ఎక్కువ. వందేమాతరం అంటే మాతృభూమికి వందనం అని అర్థం. ఇది దేశ ప్రేమను చెబుతుంది. స్వాతంత్ర్య సమరయోధులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిర్ణయించిన గేయం ఇది. 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఈ గీతానికి స్వరాలను అందించారు.
36
ఇదే యుద్ధ నినాదం
ప్రముఖ స్వాతంత్రోద్యమకారులు మదన్మోహన్ మాలవ్య, లాలా లజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్, అరవింద ఘోష్ వంటి నేతలు ఎందరో తమ ఉద్యమాలలో వందేమాతరాన్ని ప్రేరణగా చేసుకున్నారు. దేశ ప్రజలను వందేమాతర గేయంతో ప్రేరేపించారు. వందేమాతరం అనేది స్వాతంత్ర్య ఉద్యమానికి యుద్ధ నినాదంగా అప్పట్లో మారిపోయింది.
1947లో స్వాతంత్రం వచ్చాక వందేమాతరం జాతీయ గేయంగా గుర్తింపు పొందింది. జాతీయగీతం గా జనగణమనకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో వందేమాతరం గేయానికి కూడా అంతే సమాన గౌరవాన్ని ఇచ్చారు. దేశ గౌరవానికి ప్రత్యేకగా నిలిచిన ఈ పాట... ఇప్పటికీ ప్రతి జాతీయ వేడుకలో వినిపిస్తూనే ఉంటుంది.
56
భూమి కాదు... తల్లి
మాతృభూమిని దేవతగా చూపించే ఈ వందేమాతరం భారతీయ సంస్కృతికి ఒక ప్రతీక. దీన్ని పాడుతున్నప్పుడు మనలో దేశభక్తి, త్యాగస్పూర్తి, ఐక్యత అన్నీ నిండిపోతాయి. 150 ఏళ్ళు అయిన సందర్భంగా వందేమాతర జయంతి ఉత్సవాన్ని దేశమంతా ఘనంగా జరుపుకుంటున్నారు. పాఠశాలల నుండి విద్యాశాలల వరకు వందేమాతరాన్ని గుర్తు చేసుకుంటున్నారు. దేశం అంటే భూమి కాదు ఆమె తల్లి. ఆ తల్లిని గౌరవించడం, కాపాడుకోవడం ప్రతి భారతీయుడు కర్తవ్యం అని వందేమాతర గేయం చెబుతోంది.
66
150 ఏళ్లు పూర్తి
వందేమాతరం అనేది మన దేశ హృదయ ధ్వని. ఇది ఎప్పటికీ మోగుతూనే ఉంటుంది. మనదేశంలో స్వాతంత్ర్య కోసం త్యాగం చేసిన మహనీయుల జ్ఞాపకాలను మన మనసుల్లో సజీవంగా ఉంచగలిగేది ఈ గీతం. ఈ పాటకు 150 ఏళ్లు అయిన సందర్భంగా మనం వందేమాతరానికి నిజమైన వందనాన్ని సమర్పించాలి.