
భారతదేశాన్ని సరికొత్తగా, మునుపెన్నడూ చూడని విధంగా ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఐఆర్‌సీటీసీ (IRCTC) టూరిజం మీకోసం అదిరిపోయే ఆఫర్లను తీసుకువచ్చింది. తక్కువ ధరలోనే ఆన్‌లైన్ ప్యాకేజీ బుకింగ్స్ అందిస్తూ, దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు ఇండియన్ రైల్వేస్ అద్భుతమైన ప్రయాణ అనుభూతులను మీకు అందిస్తోంది.
సేఫ్ అండ్ కంఫర్టబుల్ జర్నీతో పాటు, లైఫ్‌టైమ్ గుర్తుండిపోయే మెమొరీస్ అందించేలా ఈ ప్యాకేజీలను డిజైన్ చేశారు. ఇండియాలోని ఫేమస్ సిటీస్, ఆధ్యాత్మిక ప్రాంతాలు, ప్రకృతి అందాలను తక్కువ ధరలోనే చుట్టేయడానికి ఇదో సూపర్ ఛాన్స్.
మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక కట్టడాలు, పండుగలు, వివిధ ప్రాంతాల వంటకాలను ప్రతిబింబించేలా ఐఆర్‌సీటీసీ ప్రత్యేకంగా 'భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను' ప్రారంభించింది. ఈ రైలు కోచ్‌లను "ప్రైడ్ ఆఫ్ ఇండియా - భారత్ గౌరవ్" థీమ్‌తో అద్భుతంగా డిజైన్ చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి ఈ రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో స్లీపర్ క్లాస్‌తో పాటు ఏసీ కోచ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అందరి బడ్జెట్‌కు ఇది సెట్ అవుతుంది.
ఈ ప్యాకేజీ తీసుకుంటే రైలు ప్రయాణంతో పాటు బస్సుల్లో లోకల్ టూర్స్, హోటల్ వసతి, టూర్ గైడ్లు, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఇంకా వేడివేడిగా లోకల్ వంటకాలను అందించే ప్యాంట్రీ కార్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మన దేశాన్ని చుట్టేయడానికి దీనికంటే బెస్ట్ ఆప్షన్ లేదని చెప్పవచ్చు.
రాజభవనాన్ని తలపించే రైల్లో, రాయల్ లుక్‌తో ప్రయాణించాలనుకుంటే 'మహారాజాస్ ఎక్స్‌ప్రెస్' పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ లగ్జరీ రైల్లో ప్రయాణికులకు వరల్డ్ క్లాస్ సర్వీసెస్, అద్భుతమైన లొకేషన్స్ చూసే అవకాశం లభిస్తుంది. దేశంలోని విభిన్న ప్రాంతాలను కవర్ చేస్తూ ఇందులో నాలుగు రకాల స్పెషల్ రూట్లు ఉన్నాయి. వైల్డ్‌లైఫ్ సెంచరీల నుండి వైబ్రెంట్ సిటీస్ వరకు అన్నింటినీ ఇందులో చూడొచ్చు.
ఈ రైల్లోని ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లలో తాజా లోకల్ ఐటమ్స్‌తో చేసిన రుచికరమైన ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. ఏసీతో కూడిన లగ్జరీ క్యాబిన్లు, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే స్టాఫ్, లైవ్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ వంటి ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి.
భారతదేశంలో బౌద్ధ పర్యాటకాన్ని ప్రమోట్ చేయడానికి ఐఆర్‌సీటీసీ ఈ స్పెషల్ ట్రైన్‌ను నడుపుతోంది. ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలనుకునే వారికి, గౌతమ బుద్ధుని జీవిత విశేషాలను తెలుసుకోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ టూర్ ప్యాకేజీలో బౌద్ధమతానికి సంబంధించిన ప్రముఖ పుణ్యక్షేత్రాలు, కట్టడాలను సందర్శించవచ్చు.
ఈ రైలు గయ, రాజ్‌గిర్, నలంద, వారణాసి, సార్నాథ్, లుంబిని (నేపాల్), కుశీనగర్, శ్రావస్తి, ఆగ్రా వంటి ముఖ్యమైన ప్రాంతాలను కవర్ చేస్తుంది. ప్రాచీన భారతదేశ వైభవాన్ని, బౌద్ధమత చరిత్రను క్లోజ్‌గా చూడాలనుకునే పర్యాటకులు, ఆధ్యాత్మిక అన్వేషకులు ఐఆర్‌సీటీసీ బుద్ధిస్ట్ సర్క్యూట్ రైలును ఎంచుకోవచ్చు.
సౌత్ ఇండియా అందాలను లగ్జరీగా, స్టైలిష్‌గా చూడాలనుకుంటే 'గోల్డెన్ చారియట్' రైలు ప్రయాణం ది బెస్ట్ అని చెప్పొచ్చు. బెంగుళూరులో సాంప్రదాయ సంగీతం, నృత్య ప్రదర్శనలతో ఈ ప్రయాణం గ్రాండ్‌గా స్టార్ట్ అవుతుంది. కొచ్చిన్, మైసూర్ వంటి నగరాలతో పాటు హంపి, మహాబలిపురం లాంటి అద్భుతమైన చారిత్రక ప్రదేశాలను ఈ టూర్ ద్వారా సందర్శించవచ్చు.
ఈ రైల్లో రుచి, నలపాక అనే రెండు రెస్టారెంట్లు ఉన్నాయి. ఇవి వరల్డ్ క్లాస్ వంటకాలతో పాటు ఇండియన్ స్పెషల్స్ అందిస్తాయి. అలాగే మదిర బార్‌లో బెస్ట్ వైన్స్, స్పిరిట్స్ దొరుకుతాయి. ప్రయాణంలో అలసట పోగొట్టుకోవడానికి ఆరోగ్య పేరుతో స్పా అండ్ ఫిట్నెస్ సెంటర్ కూడా ఉంది. ఇక్కడ సాంప్రదాయ ఆయుర్వేద స్పా థెరపీలు అందుబాటులో ఉంటాయి.
భారతీయ పల్లెలు, పచ్చని పొలాలు, కొండ కోనలు, పురాతన దేవాలయాల మధ్య గుండా సాగే టాయ్ ట్రైన్ ప్రయాణం ఒక అద్భుతమైన ఫీలింగ్ ఇస్తుంది. కిటికీ పక్కన కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదించడం నిజంగా ఒక విభిన్నమైన అనుభూతి. ఉత్తరాన ఉన్న హిమాలయాల నుండి దక్షిణాన ఉన్న నీలగిరి కొండల వరకు దేశంలో ఎన్నో ఫేమస్ టాయ్ ట్రైన్ రూట్లు ఉన్నాయి.
మన దేశంలో తప్పక విజిట్ చేయాల్సిన ముఖ్యమైన టాయ్ ట్రైన్ జర్నీలు ఇవే:
• డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, పశ్చిమ బెంగాల్
• కల్కా-షిమ్లా రైల్వే, హిమాచల్ ప్రదేశ్
• నీలగిరి మౌంటైన్ రైల్వే, తమిళనాడు
• మాథెరన్ హిల్ రైల్వే, మహారాష్ట్ర
• కాంగ్రా వ్యాలీ రైల్వే, హిమాచల్ ప్రదేశ్
భారతదేశపు అద్భుతమైన సంస్కృతిని, ప్రకృతిని దగ్గరగా చూడటానికి ఈ టాయ్ ట్రైన్ ప్రయాణాలను అస్సలు మిస్ అవ్వకండి. తాజా ప్యాకేజీలు, ధరలు, ఆఫర్ల పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.com ను సంప్రదించండి.