Petrol Price Cut : ఇంటికి దగ్గర్లో ఈ పెట్రోల్ బంక్ ఉందంటే మీరు లక్కీ.. భారీ తగ్గింపు ధరకు పెట్రోల్, డీజిల్ పొందవచ్చు

Published : Jul 01, 2026, 04:06 PM IST

పెట్రోల్ ధరలు మండిపోతున్నాయని బాధపడుతున్నారా? అయితే మీకు ఓ శుభవార్త. ఓ ప్రముఖ ఇంధన కంపెనీ దేశవ్యాప్తంగా తన బంకుల్లో లీటర్ పెట్రోల్‌పై ఏకంగా 5 రూపాయలు తగ్గించింది. ఇంతకూ ఆ  బంక్ ఏదో తెలుసా?

PREV
15
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు

ఇంధన ధరలు ప్రజల జీవితాలను శాసిస్తాయి.. పెట్రోల్, డీజిల్ ధరల్లో చిన్న మార్పు వచ్చినా సామాన్యుడి నెల బడ్జెట్‌ పూర్తిగా తారుమారు అవుతుంది. వీటి ధరలు పెరిగితే నేరుగా వాహనదారులపై భారం పడుతుంది… అలాగే నిత్యావసరాలు, ఇతర వస్తువుల రవాణా ఖర్చులు పెరిగి ధరలు పెరుగుతాయి. ఇలా యావత్ దేశం ఎఫెక్ట్ అవుతుంది.

ఇటీవల మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు కాస్త చక్కబడి అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గాయి… దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ప్రైవేట్ ఇంధన సంస్థ నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గించింది… ఇది వినియోగదారులకు పెద్ద ఊరటనిస్తోంది.

25
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు వెనుక కారణమేంటి?

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, మార్కెట్ పోటీకి అనుగుణంగా మన దేశంలో ఇంధన ధరలు మారుతూ ఉంటాయి. అయితే ఇటీవల ఇజ్రాయెల్, అమెరికాతో ఇరాన్ యుద్దానికి దిగడంతో కీలకమైన చమురు రవాణా మార్గం హర్మూజ్ మూతపడింది. సరఫరా తగ్గి డిమాండ్ పెరగడంతో ఆటోమెటిగ్గా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇప్పుడు ఉద్రిక్తతలు తగ్గి సరఫరా పెరగడంతో ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు దేశవ్యాప్తంగా పెట్రోల్, డిజిల్ ధరలను తగ్గించింది నయారా సంస్థ.   అంతర్జాతీయ మార్కెట్ ప్రయోజనాలను నేరుగా వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నయారాా సంస్థ ప్రతినిధులు తెలిపారు.

35
పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.3 తగ్గింపు

ప్రైవేట్ రంగ సంస్థ అయిన నయారా ఎనర్జీ (Nayara Energy) ఈ ధరల తగ్గింపును ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న 7,000కు పైగా నయారా బంకుల్లో ఈ కొత్త ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ రంగ సంస్థల ధరలతో పోలిస్తే నయారా బంకుల్లో రూ.5 తక్కువకే లీటర్ పెట్రోల్, రూ.3 తగ్గింపుకే లీటర్ డీజిల్ లభిస్తుండటం వాహనదారులను ఆకర్షిస్తోంది.

45
వినియోగదారులకు కలిగే లాభాలు...

ఈ ధరల తగ్గింపు వల్ల మధ్యతరగతి ప్రజల నుంచి వ్యాపారుల వరకు అందరికీ ప్రయోజనం చేకూరుతుంది. రోజూ బైకులు, కార్లు వాడే ఉద్యోగులు, విద్యార్థులకు నెలవారీ పెట్రోల్ ఖర్చు తగ్గుతుంది. చిన్న వ్యాపారులకు, డెలివరీ సంస్థలకు రవాణా ఖర్చులు (Operational Cost) ఆదా అవుతాయి. ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు సరుకు రవాణాచేసే లారీలు, ట్రక్కులు వంటి పెద్ద వాహనాలకు ఈ తగ్గింపుతో పెద్ద మొత్తంలో డబ్బును మిగులుస్తుంది.

55
ఈ పెట్రోల్ బంకుల్లోనే ధరలు తగ్గుతాయా?

భారత ఇంధన మార్కెట్లో ఎక్కువగా ప్రభుత్వ రంగ సంస్థలదే ఆధిపత్యం. ఇలాంటి సమయంలో నయారా లాంటి ప్రైవేట్ సంస్థ 7,000 బంకుల్లో ధరలు తగ్గించడంతో, కస్టమర్లను కాపాడుకోవడానికి ఇతర కంపెనీలు కూడా ధరలు తగ్గించే అవకాశం ఉంది. ఈ ఆరోగ్యకరమైన పోటీ, వినియోగదారులకు మరింత మేలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్న జనాలకు నయారా ప్రకటించిన ఈ తగ్గింపు పెద్ద బూస్ట్ ఇచ్చింది. ఈ చర్య వినియోగదారుల చేతిలో అదనపు డబ్బును మిగల్చడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఒకరకంగా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వ ఇంధన సంస్థలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తే ప్రజలకు మరింత ఊరట దక్కుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories