toll gate
టోల్ ప్లాజాల్లో ఎన్నో మార్పులు జరగుతున్నాయి. ఒకప్పుడు నిమిషాల తరబడి హైవేలపై వాహనదారులు వేచి ఉండే వారు. కానీ ఫాస్టాగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత రెప్పపాటు క్షణాల్లో వాహనాలు రోడ్లపై కదులుతున్నాయి. ఇక వాహనదారులు ప్రయాణించిన దూరం, ప్రాంతం ఆధారంగా ఈ టోల్ ఛార్జీలు ఉంటాయనే విషయం తెలిసిందే. దేశంలో అత్యధిక ఆదాయం వచ్చే టోల్ ప్లాజా ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.? ఇంతకీ ఆ టోల్ ప్లాజా ఏంటి.? ఎంత ఆదాయం వస్తుంది లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
toll gate
భర్తనా.. పెద్దగా ఎవరికీ తెలియని ఈ గ్రామంలో ఉన్న టోల్ ప్లాజాకు దేశంలో అత్యధిక వసూళ్లు రాబట్టే టోల్‌గా గుర్తింపు ఉంది. ఢిల్లీ నుంచి ముంబైని కలిపే మార్గంలో గుజరాత్‌లోని NH-48లోని వడోదర-భరూచ్ సమీపంలో ఉందీ టోల్. ఈ టోల్ ప్లాజా గత ఐదు సంవత్సరాలలో సగటున వార్షిక ఆదాయం రూ.400 కోట్లు ఆర్జించింది. గణాంకాల ప్రకారం ఈ టోల్ 2019 నుంచి 2024 వరకు ఏకంగా రూ. 2044 కోట్ల ఆదాయం వచ్చింది.
దేశంలో అత్యంత రద్దీగా ఉండే టోల్ ప్లాజాగా దీనికి పేరు ఉంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ టోల్ ప్లాజా 2023-24లో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో, టోల్ ప్లాజాలో రూ.472.65 కోట్ల విలువైన టోల్ వసూలు అయ్యింది. ఈ మార్గంలో ప్రయాణిస్తే సింగిల్ వేకి రూ. 155, డబుల్ వేకి రూ. 230 చెల్లించాల్సి ఉంటుంది. బస్సు లేదా ట్రక్కుకు వన్ వే రూ. 515 కాగా రెండు వైపులకు రూ. 775 వసూలు చేస్తారు.
toll gate
దేశంలో టాప్ 5 టోల్ ప్లాజాలు ఇవే..
భర్తనా తర్వాత రాజస్థాన్‌లోని షాజహాన్‌పూర్ టోల్ ప్లాజా రెండవ స్థానంలో ఉంది, దీని ఆదాయం ఐదు సంవత్సరాలలో రూ. 1884 కోట్లు. మూడవ స్థానంలో పశ్చిమ బెంగాల్‌లోని జల్ధులగోరి టోల్ ప్లాజా ఉంది. గత ఐదు సంవత్సరాలలో దీని ఆదాయం రూ.1539 కోట్లు. టోల్ ప్లాజాల ఆదాయంలో ఉత్తరప్రదేశ్‌లోని బడాజోర్ (1481 కోట్లు) నాల్గవ స్థానంలో ఉండగా, హర్యానాలోని ఘరౌండా (1314 కోట్లు) ఐదవ స్థానంలో ఉంది.
toll gate toll free
కేంద్ర ప్రభుత్వ గణంకాల ప్రకారం.. గత ఐదు సంవత్సరాలలో ప్రయాణికులు రూ.1.9 లక్షల కోట్లకు పైగా టోల్ ఫీజులు చెల్లించారు. అయితే ఇది హైవే అభివృద్ధి, నిర్వహణ కోసం కేటాయించిన వార్షిక బడ్జెట్‌లో ఐదవ వంతు మాత్రమే కావడం గమనార్హం. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే.. ఉత్తరప్రదేశ్ అత్యధిక టోల్ వసూళ్లను నమోదు చేసింది. గత ఐదు సంవత్సరాలలో 97 ప్లాజాల నుంచి రూ.22,914 కోట్లు వసూలు అయ్యాయి. రాజస్థాన్‌లో అత్యధిక టోల్ ప్లాజాలు (156) ఉన్నప్పటికీ, రూ.20,308 కోట్ల స్వల్ప వసూళ్లు నమోదయ్యాయి.