IRCTC New Rule:మే 1 నుండి భారతీయ రైల్వేలో కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉన్న ప్రయాణికులు స్లీపర్ లేదా ఏసీ బోగీలలో ప్రయాణించడానికి అనుమతి లేదు. కన్ఫర్మ్ టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానాలతో పాటు కఠిన చర్యలు ఉంటాయి.
15
రైల్వే వెయిటింగ్ లిస్ట్ టికెట్లు
వెయిటింగ్ లిస్ట్ టికెట్లతో రైళ్లలో ప్రయాణించే వారికి ఐఆర్‌సీటీసీ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. మే 1 నుండి, వెయిటింగ్ లిస్ట్ ఉన్న ప్రయాణికులు స్లీపర్ లేదా ఏసీ బోగీలలో ప్రయాణించడానికి అనుమతించరు.
25
రైలు ప్రయాణ రద్దీని తగ్గించే చర్యలు
కన్ఫర్మ్ టికెట్ ఉన్న ప్రయాణికుల ఇబ్బందిని తప్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. పండుగ సమయాల్లో రైళ్లలో రద్దీ తగ్గుతుంది. ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
35
రైల్వేలో కొత్త నియమాలు
కొత్త నియమం అమలులోకి వస్తున్నందున, మే 1 నుండి రైళ్లలో స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణించేవారు నిబంధనలు పాటించాలి. ప్రయాణంలో ఇబ్బంది తప్పించుకోవడానికి టికెట్లు కన్ఫర్మ్ చేసుకోవాలి. టిక్కెట్ లేకుండా ప్రయాణం చేసే వారికి జరిమానాతో పాటు ఇతర చర్యలు తీసుకోనున్నారు.
కన్ఫర్మ్ టికెట్ లేకుండా ఏసీ, స్లీపర్ బోగీల్లో ప్రయాణించడానికి వీల్లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే, స్లీపర్ కి 250 రూపాయలు, ఏసీకి 440 రూపాయల జరిమానాతో పాటు ప్రయాణించిన దూరానికి ఛార్జీలు చెల్లించాలి. అలాగే, జరిమానాతో పాటు ఇతర చర్యలు కూడా తీసుకుంటామని భారతీయ రైల్వే హెచ్చరించింది.
55
టీటీఈలు ఈ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలి. వెయిటింగ్ లిస్ట్ టికెట్ తో రిజర్వ్డ్ బోగీలో ఎక్కితే, తదుపరి స్టేషన్లో దిగమని చెప్పి, జరిమానా విధిస్తారు. చాలా సందర్భాల్లో ముందస్తు హెచ్చరికలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.