India vs Pak: భార‌త్, పాక్ యుద్ధం త‌ప్ప‌దా.? ఏ క్ష‌ణంలో అయినా..

Published : Apr 30, 2025, 11:51 AM IST

భార‌త్‌, పాకిస్తాన్‌ల మ‌ధ్య ఉద్రిక‌త్త‌లు పెరుగుతున్నాయి. ప‌హ‌ల్గాంలో జ‌రిగిన ఉగ్ర‌దాడి త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య ప‌రిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ దాడి వెన‌కాల పాకిస్థాన్ హ‌స్తం ఉంద‌ని భార‌త్ ఆధారాల‌తో స‌హా నిరూపిస్తోంది. అయితే పాక్ మాత్రం త‌మ త‌ప్పులేద‌ని చెబుతూనే మ‌రోవైపు క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది. ఈ నేప‌థ్యంలో రెండు దేశాల మ‌ధ్య జ‌రుగుతోన్న ప‌రిణామాలు ఇప్పుడు చూద్దాం.   

PREV
15
India vs Pak: భార‌త్, పాక్ యుద్ధం త‌ప్ప‌దా.? ఏ క్ష‌ణంలో అయినా..

పాకిస్థాన్ ఉగ్ర‌వాదుల‌ను పెంచి పోషిస్తోంద‌ని, ప‌హ‌ల్గాం దాడి వెన‌కాల పాక్ ప్రోత్సాహం ఉంద‌ని న‌మ్ముతోన్న భార‌త్ పాకిస్థాన్‌పై ప్రతికార చ‌ర్య‌ల‌కు దిగుతోంది. ఇందులో భాగంగానే పాకిస్థాన్‌‌కి వ్యతిరేకంగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇక పాక్ సైతం అదే రీతిలో స్పందించి.. భారత్‌తో గతంలో చేసుకున్న సిమ్లా ఒప్పందాన్ని సైతం రద్దు చేసింది.
 

25

భార‌త్ దాడి చేస్తుంద‌న్న‌ పాకిస్థాన్ మంత్రి

పాకిస్థాన్ మంత్రి అత్తావుల్లా త‌రార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త్ త‌మ‌పై మ‌రో 24 నుంచి 36 గంట‌ల్లో మిలిటరీ యాక్షన్ తీసుకుంటుందని అన్నారు. ఇందుకు సంబంధించి త‌మ వ‌ద్ద విశ్వ‌సనీయ స‌మాచారం ఉంద‌ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 

క‌శ్మీర్ సంఘ‌ట‌న‌లో పాక్ పాత్ర ఉంద‌ని భారత్ ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేస్తోంద‌న్నారు. ఉగ్ర‌వాదానికి తాము కూడా బాధితులేమన‌న్న అత్తావుల్లా కానీ తమను ఇండియా ఏకపక్షంగా దోషులుగా తేల్చేసిందన్నారు. భార‌త్ దాడిని ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు.

35
Pak force

క‌వ్వింపుల‌కు దిగుతోన్న పాకిస్థాన్ 

ఓవైపు భార‌త్ త‌మ‌పై దాడి చేస్తుంద‌ని అంటూనే మ‌రోవైపు పాక్ త‌న వంక‌ర బుద్ధిని బ‌య‌ట‌పెడ‌తోంది. జమ్మూకశ్మీర్ అఖ్నూర్ సెక్టార్లోని పర్గ్వాల్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద కాల్పులకు పాల్పడింది. చీనాబ్ రివర్ పోస్పై కాల్పులు చేయగా భారత ఆర్మీ దీటుగా బదులిచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నుంచి సరిహద్దుల్లో పాక్ కాల్పులు జరుపుతున్న సంగతి తెలిసిందే.

45

మోదీ కీలక సమావేశాలు

స‌రిహ‌ద్దులో నెల‌కొన్న ఉద్రిక్త వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ బుధ‌వారం కీల‌క సమావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే సీసీఎస్ మీటింగ్ నిర్వ‌హించారు. ఇందులో హోం మంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, అజిత్ ధోవల్ పాల్గొన్నారు.

ఇందులో పాక్ కు ఐఎంఎఫ్ నిధులను ఎలా నియంత్రించాలన్న అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. అనంతరం మోదీ నేతృత్వంలో సీసీపీఏ సమావేశం.. తర్వాత సీసీఈఏ (విదేశీ వ్యవహారాలపై కేబినెట్ సమావేశం) పూర్తి స్థాయి కేబినెట్ సమావేశం జరుగనున్నాయి.

55

దూసుకెళ్తున్న డిఫెన్స్ స్టాక్స్‌

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కొద్ది రోజులుగా భారత స్టాక్ మార్కెట్లో డిఫెన్స్ కంపెనీల షేర్లు దూసుకెళ్తున్నాయి. మంగ‌ళ‌వారం ఒక్క రోజే ఏకంగా 20 శాతం పెరిగాయి. రానున్న రోజుల్లో 10 నుంచి 15 శాతం లాభాలు పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. భారత ప్రభుత్వం డిఫెన్స్ రంగంలో ఎక్కువగా ఖర్చు చేస్తుండటంతో ఆ స్టాక్స్ పుంజుకుంటున్నాయి. నిన్న నిఫ్టీ డిఫెన్స్ ఇండెక్స్లో 18 స్టాక్కు గాను 17 లాభాల్లో ట్రేడయ్యాయి.

Read more Photos on
click me!

Recommended Stories