Lockdown : మళ్లీ ఇండియాలో లాక్ డౌన్ విధిస్తారా..? ఆల్ పార్టీ మీటింగ్ లో కేంద్రం క్లారిటీ

Published : Mar 25, 2026, 09:35 PM IST

India Lockdown : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం నేపథ్యంలో ఇండియాలో అలజడి రేగింది. గ్యాస్, పెట్రోల్ కొరత ప్రచారం నేపధ్యంలో మళ్ళీ లాక్ డౌన్ విధిస్తారనే వార్తలు జోరందుకున్నాయి. దీనిపై కేంద్రం ఏమంటోంది..?

PREV
16
అఖిలపక్ష సమావేశంలో కీలక చర్చ...

Lockdown : మిడిల్ ఈస్ట్ లో పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇండియాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే వంటగ్యాస్ (LPG) కొరత ఏర్పడి హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే పరిస్థితి నెలకొంది… మరోవైపు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత కూడా ఏర్పడుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతోందన్న ప్రచారంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఇలా ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్దం ఇండియన్స్ ని ఇబ్బందులకు గురిచేస్తోంది.

అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కరోనా సమయంలో మాదిరిగా మళ్లీ లాక్ డౌన్ పెడతారన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది... కానీ ప్రజల్లో భయాందోళనలు తగ్గడం లేదు. ఇలాంటి సమయంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సందేశం ఇచ్చింది. 

బుధవారం న్యూఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన కీలకమైన అఖిలపక్ష సమావేశం జరిగింది. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో ప్రభుత్వం, విపక్షాల మధ్య పలు ముఖ్యమైన అంశాలపై బహిరంగంగా చర్చ జరిగింది.

26
ఇండియాకు మరో రెండు ఎల్పిజి నౌకలు

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగంతో సమావేశం మొదలైంది. ఆ తర్వాత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పూర్తి వివరాలతో ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే దేశంలో పెట్రోలియం ఉత్పత్తులకు ప్రస్తుతానికి ఎలాంటి కొరత లేదని కూడా తేల్చి చెప్పింది.

అందరిలోనూ తీవ్ర ఆందోళన రేపిన అంశం హోర్ముజ్ జలసంధి. ఇప్పటివరకు 4 భారత నౌకలు ఈ మార్గం నుంచి సురక్షితంగా బయటపడ్డాయని, మరికొన్ని కూడా త్వరలో రానున్నాయని ప్రభుత్వం తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో పశ్చిమ తీరానికి రెండు భారీ ఎల్పీజీ నౌకలు చేరుకోనున్నాయని, వాటిలో సుమారు 92 వేల టన్నుల గ్యాస్ ఉంటుందని సమావేశంలో తెలిపారు. చాలా దేశాల నౌకలు ఇప్పటికీ ఆ ప్రాంతంలో చిక్కుకుపోయిన నేపథ్యంలో ఇది చాలా ముఖ్యమైన విషయం.

36
ప్రధాని మోదీ, ట్రంప్ సంభాషణ ప్రస్తావన

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడిన విషయాన్ని కూడా ఈ సమావేశంలో వెల్లడించారు. భారత్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, శాంతినే కోరుకుంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేసినట్లు సమాచారం.

దేశంలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని ప్రభుత్వం అన్ని పార్టీలకు భరోసా ఇచ్చింది. ఎల్పీజీ, పెట్రోలియం కోసం ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌లు చేశామని, పలు దేశాలతో చర్చలు జరుపుతున్నామని తెలిపింది.

46
ప్రభుత్వం చెప్పిన వివరాలు
  • ముడి చమురు సరఫరా నిరంతరం కొనసాగుతోంది.
  • సరఫరా వ్యవస్థను నిశితంగా గమనిస్తున్నాం.
  • సామాన్య ప్రజలకు ఎలాంటి కొరత ఉండదు.
  • వంట గ్యాస్ ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదు.
  • రోజూ లక్షలాది బుకింగ్‌లు వస్తున్నా సరఫరా ఆగలేదు.
56
విపక్షాల ప్రశ్నలు: ఇరాన్, అమెరికా, దౌత్యనీతిపై చర్చ

సమావేశంలో విపక్షాలు పలు ప్రశ్నలు లేవనెత్తాయి. అసదుద్దీన్ ఒవైసీ ఇరాన్ సుప్రీం లీడర్ విషయం, దౌత్యపరమైన స్పందన గురించి ప్రశ్నించారు. దీనికి విదేశాంగ కార్యదర్శి సమాధానమిస్తూ, ఇరాన్ ఎంబసీ ఆలస్యంగా తెరవడం వల్లే సంతాప సందేశంలో జాప్యం జరిగిందని వివరించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడిపైనా ప్రశ్నలు రాగా, ఇది అణు కార్యకలాపాలకు సంబంధించిన విషయమని ప్రభుత్వం పేర్కొంది.

సమావేశంలో ఎవరు పాల్గొన్నారు?

ఈ కీలక భేటీలో హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి సహా పలువురు పెద్ద నేతలు పాల్గొన్నారు. విపక్షాల నుంచి చాలా పార్టీల ప్రతినిధులు హాజరైనప్పటికీ, తృణమూల్ కాంగ్రెస్ ఈ సమావేశానికి దూరంగా ఉంది.

66
సంక్షోభం పెద్దదే...

ఈ సమావేశం అసలు ఎందుకు పెట్టారు?

పశ్చిమ ఆసియా పరిస్థితులపై పార్లమెంటులో చర్చ జరిగిన తర్వాత, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీనికి స్పందనగా ప్రభుత్వం ఈ భేటీని నిర్వహించింది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఇప్పటికే 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిందని, అవి ఇంధన, నిత్యావసర సేవలపై నిఘా ఉంచాయని ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో ముందే తెలిపారు.

 పశ్చిమ ఆసియా సంక్షోభం తీవ్రమైనదే అయినా, దాన్ని ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఇంధన సరఫరా నుంచి దౌత్యపరమైన వ్యూహాల వరకు, ప్రతి స్థాయిలోనూ నిఘా ఉంచారు. అంతిమంగా ప్రభుత్వం ఇచ్చే సందేశం ఒక్కటే - సామాన్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories