Indian Bullet Train : జపాన్ అవసరం లేదు.. మన బుల్లెట్ ట్రైన్ రెడీ! గంటకు ఎన్ని కిలోమీటర్లో తెలుసా?

Published : May 13, 2026, 02:21 PM IST

Indian Bullet Train B28 : భారతదేశం గర్వించదగ్గ రీతిలో పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారవుతున్న B28 బుల్లెట్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. గంటకు 280 కి.మీ వేగంతో దూసుకెళ్లే ఈ రైలు విశేషాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
ఇండియన్ బుల్లెట్ రైలు B28 వచ్చేస్తోంది.. స్పీడ్ చూస్తే మైండ్ బ్లాంకే!

ఇండియన్ రైల్వేస్ రూపురేఖలు మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ తో అదరగొట్టిన భారత్, ఇప్పుడు అసలైన బుల్లెట్ స్పీడ్ చూపేందుకు సిద్ధమైంది. విదేశీ టెక్నాలజీపై ఆధారపడకుండా, పూర్తిగా మన దేశంలోనే రూపొందుతున్న మొట్టమొదటి స్వదేశీ బుల్లెట్ రైలు B28 రాకకు ముహూర్తం ఖరారైంది.

25
ఏమిటీ B28? దీని స్పీడ్ ఎంతంటే?

సాధారణంగా బుల్లెట్ రైలు అనగానే మనకు జపాన్ షింకన్సెన్ గుర్తుకు వస్తుంది. కానీ, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా బెంగళూరుకు చెందిన BEML (Bharat Earth Movers Limited) ఈ సరికొత్త హైస్పీడ్ రైలును నిర్మిస్తోంది. దీనికి పెట్టిన పేరే B28.

• ఈ రైలు గరిష్ఠంగా గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నారు.

• ప్రారంభంలో దీని ఆపరేటింగ్ స్పీడ్ 250 కి.మీ.గా ఉంటుంది.

• అంటే మన ప్రస్తుత ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే ఇది దాదాపు మూడు రెట్లు వేగంగా దూసుకుపోతుంది.

35
అల్ట్రా మోడరన్ ఫీచర్లు.. ఫ్లైట్ రేంజ్ లగ్జరీ బుల్లెట్ ట్రైన్

ఈ B28 రైలు కేవలం వేగంలోనే కాదు, సౌకర్యాల్లో కూడా నెక్స్ట్ లెవల్ ఉండబోతోంది.

• ఏరోడైనమిక్ డిజైన్: గాలిని చీల్చుకుంటూ వెళ్లేలా ఫ్రంట్ డిజైన్ ఉంటుంది, దీనివల్ల వేగంగా వెళ్తున్నప్పుడు కూడా రైలు చాలా స్ట్రాంగ్‌గా, నిలకడగా ఉంటుంది.

• బోగీల అమరిక: ఒక్కో రైలు సెట్‌లో 8 ఏసీ బోగీలు ఉంటాయి. అన్నీ చైర్ కార్ మోడల్.

• స్పెషల్ సీట్లు: ప్రయాణికుల కంఫర్ట్ కోసం రెక్లైనింగ్, అలాగే 180 డిగ్రీలు రోటేట్ అయ్యే సీట్లు ఉంటాయి.

• టెక్నాలజీ: లోపల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్, దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతులు, అతి తక్కువ శబ్దం వచ్చేలా సౌండ్ ప్రూఫింగ్ చేస్తున్నారు.

45
ఎప్పుడు.. ఏ రూట్‌లో ఈ బుల్లెట్ ట్రైన్ మొదలవుతుంది?

రైల్వే శాఖ ప్లాన్ ప్రకారం, ఈ స్వదేశీ బుల్లెట్ రైలు మొదటి ప్రోటోటైప్ 2027 మార్చి నాటికి సిద్ధం కానుంది. ఆ తర్వాత పలు పరీక్షలు, ట్రయల్ రన్స్ నిర్వహిస్తారు.

• ఫస్ట్ రూట్: ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్‌లో భాగంగా ఉన్న సూరత్ నుంచి వాపి (97 కి.మీ.) మధ్య 2027 ఆగస్టులో ఈ రైలు మొదటిసారి పబ్లిక్ కోసం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

• ముంబై-అహ్మదాబాద్ ప్రాజెక్టులో జపాన్ టెక్నాలజీ వాడుతున్నప్పటికీ, మన సొంత B28 సక్సెస్ అయితే భవిష్యత్తులో ఖర్చు భారీగా తగ్గుతుంది.

55
నెక్స్ట్ టార్గెట్ B35.. ప్రపంచ దేశాలకు గట్టి పోటీ

భారత్ ఇక్కడితో ఆగడం లేదు. B28 ఒక ఆరంభం మాత్రమే. దీని తర్వాత గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే B35 రైలును కూడా డెవలప్ చేసే ప్లాన్‌లో రైల్వే ఉంది. ఒకప్పుడు రైళ్లలో ప్రయాణించాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు విమానాలకు పోటీగా రైళ్లు రావడం భారత ఇంజనీరింగ్ అద్భుతమనే చెప్పాలి. దీనివల్ల రవాణా వేగం పెరగడమే కాకుండా, దేశీయంగా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని ఈ రంగం నిపుణులు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories