రాహుల్ కి షాక్.. ఇండియా కూటమిలో చీలిక.. బిహార్ ఫలితాలతో టీఎంసీ కీలక డిమాండ్!

Published : Nov 17, 2025, 01:59 PM IST

బిహార్ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ఘోర పరాజయం పాలైంది. మోదీ-నితీశ్ దెబ్బకు మహాఘట్ బంధన్ ఛిన్నాభిన్నమైంది. ఈ నేపథ్యంలో టీఎంసీ రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చింది. 

PREV
15
రాహుల్ ని పక్కన పెట్టి..

బిహార్ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ఘోరంగా ఓడిపోయింది. కాంగ్రెస్, ఆర్జేడీ పరువు కాపాడుకోలేకపోయాయి. మోదీ-నితీశ్ ప్రభంజనంతో విపక్ష కూటమి చిన్నాభిన్నమైంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలు, రాహుల్ గాంధీ అయోమయంలో పడ్డారు. అంతేకాదు, ఇండియా కూటమిలోనూ విభేదాలు మొదలయ్యాయి. రాహుల్ గాంధీని తొలగించాలనే డిమాండ్ కూటమిలోనే మొదలైంది. అయితే, అక్కడ కూడా వివాదం కొనసాగుతోంది.

25
TMC vs SP

రాహుల్ గాంధీని పక్కనపెట్టి, మమతా బెనర్జీని ఇండియా కూటమికి నాయకురాలిగా ప్రకటించాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు, అఖిలేశ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ కూడా వెనక్కి తగ్గడం లేదు. అఖిలేశ్‌ను కూటమి నేతగా ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది. కానీ ఈ విషయంపై కాంగ్రెస్ మౌనంగా ఉంది.

35
మౌనం వీడని రాహుల్

బిహార్‌లో ఘోర ఓటమి తర్వాత కాంగ్రెస్ ఇప్పటికీ మౌనంగానే ఉంది. ఈ విషయంపై రాహుల్ గాంధీ పెద్దగా స్పందించలేదు. బిహార్ ఫలితాలను రాహుల్ ఆశ్చర్యకరమైన ఫలితాలు అని చెప్పినా, పార్టీ భవిష్యత్ ప్రణాళికపై ఎలాంటి సందేశం ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లోనే మమతను ఇండియా కూటమి నేతగా చేయాలని టీఎంసీ గట్టిగా డిమాండ్ చేస్తోంది.

45
పోరాడేది మమతా బెనర్జీనే..

బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేది మమతా బెనర్జీయేనని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అన్నారు. 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందని, ఇది మమత స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. బీజేపీతో పోరాడటంలో కాంగ్రెస్ విఫలమవుతోందని, అందుకే మమతను ఇండియా కూటమి నాయకురాలిగా చేయాలని అన్నారు.

55
అఖిలేశ్ కు మద్దతుగా..

మరోవైపు, బిహార్ ఎన్నికల ఫలితాలకు ముందే సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే రవిదాస్ మెహరోత్రా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. రాహుల్‌ను ప్రజా నాయకుడని కాంగ్రెస్ అనడాన్ని ఆయన విమర్శించారు. అఖిలేశ్‌కు మద్దతుగా నిలుస్తూ, ఇండియా కూటమికి రాహుల్ నాయకత్వం వహించడాన్ని ఆయన వ్యతిరేకించారు. అఖిలేశ్ వైపే ఆయన మొగ్గు చూపారు.

Read more Photos on
click me!

Recommended Stories