Independence Day 2025 : భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎలా జరుపుకోవాలి?

Published : Aug 05, 2025, 07:34 PM ISTUpdated : Aug 05, 2025, 07:49 PM IST

దశాబ్దాలుగా బ్రిటిష్ వారి నుండి స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటాన్ని గుర్తుచేసుకునేరోజు స్వాతంత్య్ర దినోత్సవం. బానిసత్వం నుండి సార్వభౌమత్వానికి చేరుకున్న భారతదేశ ప్రయాణాన్ని గర్వంగా, కృతజ్ఞతతో జరుపుకునే రోజు.

PREV
15
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం కేవలం క్యాలెండర్‌లో ఒక తేదీ మాత్రమే కాదు… భారతదేశ స్వాతంత్య్రం కోసం చేసిన సుదీర్ఘ పోరాటానికి ప్రతీక. దేశం స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు మన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను, ప్రజల ఐక్యతను గుర్తుంచుకోవాలి.  

DID YOU KNOW ?
ఆగస్ట్ 15 ఎందుకు?
భారత దేశ స్వాతంత్య్ర చట్టం జులై 18, 1947న ఆమోదం పొందింది. కానీ రెండో ప్రపంచయుద్దంలో జపాన్ లొంగిపోయిన రోజుకు గుర్తుకు ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవంగా ప్రకటించారు.
25
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఎందుకు జరుపుకుంటాం?

1947 ఆగస్టు 15న, భారతదేశం 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ వారి పాలన నుండి విముక్తి పొందింది. అణచివేత యుగానికి ముగింపు పలికి, స్వేచ్ఛా, ప్రజాస్వామ్య దేశ చరిత్ర ప్రారంభమైంది. అందుకే మన స్వాతంత్య్రం కోసం పోరాడిన వారి ధైర్యం, దృఢ సంకల్పం, త్యాగాలను స్మరించుకుంటూ ఆరోజును స్వాతంత్య్ర దినోత్సవంగా గర్వంగా జరుపుకుంటున్నాము.

35
స్వాతంత్య్ర సమరయోధులకు సెల్యూట్

భారతదేశానికి స్వాతంత్య్రం ఒక్కరోజులో రాలేదు. ఇది అనేక దశాబ్దాల పోరాటాల ఫలితం. స్వాతంత్య్ర దినోత్సవంనాడు మనం గుర్తుంచుకోవాల్సిన కొందరు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు:

మహాత్మా గాంధీ: 

అహింసా మార్గానికి ప్రతినిధి. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలకు నాయకత్వం వహించారు.

సుభాష్ చంద్రబోస్:

 ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు ద్వారా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటానికి సైనిక రూపం ఇచ్చారు.

భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్: 

వీరి విప్లవాత్మక చర్యలు, త్యాగాలు యువతలో దేశభక్తిని నింపాయి.

ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్‌లాల్ నెహ్రూ వంటి ఎందరో మహనీయులు స్వతంత్ర భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు.

వివిధ ప్రాంతాలకు, మతాలకు, సామాజిక నేపథ్యాలకు చెందిన ఈ మహనీయులందరూ ఏకమై స్వతంత్ర భారతదేశం అనే ఒకే లక్ష్యం కోసం కృషి చేశారు.

45
ఇండిపెండెన్స్ డే ఎలా జరుపుకోవాలి?

ప్రధానమంత్రి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేయడంతో ప్రతి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయి. జాతీయ ప్రసంగం, గౌరవ వందనం, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ వేడుకలకు ప్రముఖులు, సైనిక దళాలు, పాఠశాల విద్యార్థులు, పౌరులు హాజరవుతారు. ఈ వేడుకలను దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

ప్రతి ఒక్కరూ స్వాతంత్య్ర దినోత్సవంను జరుపుకుంటారు, ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, స్థానిక ప్రాంతాలలో:

  • జెండా ఎగురవేత
  • దేశభక్తి గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలు
  • స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించే ప్రసంగాలు, నాటికలు
  • మిఠాయిలు పంపిణీ, సామూహిక భోజనాలు

ఇళ్ళు, వీధులు త్రివర్ణ పతాకాలతో అలంకరించబడి ఉంటాయి. ప్రజలు కేసరి, తెలుపు, ఆకుపచ్చ రంగుల దుస్తులు ధరిస్తారు.

55
1947 నుండి ఇండియా కొత్త ప్రయాణం

1947 లో స్వాతంత్య్రం పొందిన భారతదేశం నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, అంతరిక్ష రంగంలో ప్రముఖ దేశంగా, సాంకేతికత, శాస్త్రం, సంస్కృతికి ప్రతీకగా నిలిచింది. అన్ని అడ్డంకులను అధిగమిస్తూ, విద్య, ఆరోగ్యం, రక్షణ, డిజిటల్ రంగాలలో దూసుకుపోతోంది.

ఇది కేవలం గతాన్ని గుర్తుచేసుకునే రోజు మాత్రమే కాదు, భవిష్యత్తుకు కట్టుబడి ఉండే రోజు కూడా. మరింత బలమైన, అందరినీ కలుపుకుపోయే, సాధికారత కలిగిన భారతదేశం.

Read more Photos on
click me!

Recommended Stories