Rahul Gandhi: ఢిల్లీ ధర్నాలతో దద్దరిల్లిపోతుంది. రాహుల్ గాంధీ ధర్నాలతో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. గాంధీ కుటుంబ వారసుడైన రాహుల్ గాంధీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఆయన ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు? వంటి ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోండి.
రాహుల్ గాంధీ వ్యక్తిగత ఆస్తులు ఎంత? ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టారు? ఆయన పేరు మీద ఉన్న ఆఫీసు విలువ ఎంత? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం, రాహుల్ గాంధీ మొత్తం ఆస్తుల విలువ రూ.20.39 కోట్లకు పైగా ఉంది. 2019 ఎన్నికల సమయంలో ఆయన ప్రకటించిన ఆస్తుల విలువ రూ.15.88 కోట్లు. ఈ లెక్కన ఐదేళ్లలో ఆయన ప్రకటించిన ఆస్తుల విలువ సుమారు రూ.4.5 కోట్లు పెరిగింది. ఈ వివరాలు ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ఆధారంగా వెలుగులోకి వచ్చాయి.
23
ఎక్కడ పెట్టుబడులు పెట్టారు?
రాహుల్ గాంధీ ఆస్తుల్లో ఎక్కువ భాగం షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, ఇతర పెట్టుబడుల రూపంలో ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, ఆయన వద్ద రూ.55 వేల నగదు ఉంది. రెండు బ్యాంకు ఖాతాల్లో కలిపి రూ.26.25 లక్షల డిపాజిట్లు ఉన్నాయి. దేశంలోని పలు కంపెనీల షేర్లలో సుమారు రూ.4.33 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఏడు మ్యూచువల్ ఫండ్లలో రూ.3.81 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. దాదాపు రూ.15 లక్షల విలువైన గోల్డ్ బాండ్లు కూడా ఉన్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, బీమా పథకాల్లో రూ.61.52 లక్షలు ఉన్నాయి. బంగారు ఆభరణాల విలువ సుమారు రూ.4.20 లక్షలుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ వివరాల ప్రకారం, ఆయన చరాస్తుల విలువ దాదాపు రూ.9.24 కోట్లు.
33
గురుగ్రామ్ పెద్ద ఆఫీసు
రాహుల్ గాంధీ ఆస్తుల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది గురుగ్రామ్‌లోని ఆఫీసు. హర్యానాలోని గురుగ్రామ్‌లో బహుళ అంతస్తుల భవనంలో ఆయనకు 5,538 చదరపు అడుగుల ఆఫీసు స్థలం ఉంది. 2024 ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న విలువ ప్రకారం, ఈ స్థలం విలువ సుమారు రూ.9.05 కోట్లు. ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో వ్యవసాయ భూమి కూడా ఉంది. ఈ భూమిలో ఆయనకు సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి ఉమ్మడి వాటా ఉంది. మొత్తం స్థిరాస్తుల విలువ సుమారు రూ.11.15 కోట్లుగా అఫిడవిట్‌లో వెల్లడించారు. ఆయన పేరు మీద సొంత నివాస గృహం, కారు లేవని ఆ వివరాలు చెబుతున్నాయి. అయితే ఇవన్నీ 2024 ఎన్నికల సమయంలో ప్రకటించిన లెక్కలు. ప్రస్తుతం ఆస్తుల మార్కెట్ విలువ మారి ఉండవచ్చు.