Amazon: అతిపెద్ద సంస్థ అయిన అమెజాన్ మరోసారి లేఆఫ్ లు చేసింది. తమ సంస్థలో పనిచేస్తున్న వెయ్యి మంది దాకా ఉద్యోగులను తీసేస్తున్నట్టు ప్రకటించింది. అందులో భారత్ లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఉన్నారు.
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో మరోసారి ఉద్యోగాల కోత మొదలైంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 1,000 కంటే తక్కువ ఉద్యోగాలను తొలగించినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో భారత్, అమెరికా, బ్రిటన్ దేశాల్లోని ఉద్యోగులు ఉన్నారు. ముఖ్యంగా అమెజాన్ స్టోర్స్ విభాగంలో ఈ తొలగింపులు జరిగాయి. ఈ విభాగం అమెజాన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ కార్యకలాపాలను చూస్తుంది. అయితే భారత్‌లో ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారో కంపెనీ స్పష్టంగా చెప్పలేదు.
23
ఎవరిని తొలగించారు?
తాజా తొలగింపుల్లో కస్టమర్ సర్వీస్, అమ్మకందారులకు సేవలు, మార్కెట్‌ప్లేస్ సపోర్ట్, రిటైల్ ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. ఉద్యోగాలు తొలగించిన విషయాన్ని ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా తెలియజేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ వార్తతో అమెజాన్ ఉద్యోగుల్లో ఆందోళన పెరిగింది. తొలగింపులకు గురైన ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు, ఇతర ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం, నోటీస్ పీరియడ్ వంటి అంశాలపై ఉద్యోగులు చర్చించుకున్నారు.
33
భారీగా ఉద్యోగాలు తీసేసిన అమెజాన్
ఇప్పటికే అమెజాన్ భారీ స్థాయిలో ఉద్యోగాల కోత చేపట్టింది. గత ఏడాది నుంచి ఈ ఏడాది జనవరి వరకు దాదాపు 30 వేల ఉద్యోగాలు తగ్గించినట్లు సమాచారం. కరోనా సమయంలో ఆన్‌లైన్ కొనుగోళ్లు భారీగా పెరగడంతో ఎక్కువ మందిని నియమించామని, ఇప్పుడు సంస్థలో ఉద్యోగుల సంఖ్యను సర్దుబాటు చేస్తున్నామని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తెలిపారు. ఇదే సమయంలో అమెజాన్ కృత్రిమ మేధ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. డేటా సెంటర్లు, చిప్స్, ఏఐ మౌలిక వసతుల కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేయాలని సంస్థ భావిస్తోంది