Indian missile defence: పాకిస్తాన్ బెదిరింపుల మధ్య భారత నగరాలపై భద్రతా తనదైన టెక్నాలజీని అందిపుచ్చుకుని భారత్ మన దేశాశన్ని సురక్షితంగా ఎలా ఉంచుకోగలిగింది? భారత్ డిఫెన్స్ టెక్నాలజీ ఎలా పనిచేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.
Indian missile defence: ప్రస్తుతం పలు ప్రపంచదేశాల నుంచి పెరుగుతున్న ప్రమాదాల మధ్య భారత నగరాలు అత్యాధునిక రక్షణ వ్యవస్థలతో సురక్షితంగా ఉన్నాయంటే అందుకు భారత సైన్యం వేసిన బలమైన వలలే కారణం.
పాకిస్తాన్ నుంచి వచ్చే నిరంతర బెదిరింపులకు తగిన విధంగా సమాధానం చెప్పేలా భారత వైమానిక రక్షణ వ్యవస్థలు మిసైళ్ల నుండి డ్రోన్ల దాకా పలు భద్రతా వలయాలను ఏర్పాటు చేశాయి. శత్రు దాడుల నుంచి భారత్ ను రక్షిస్తున్న డిఫెన్స్ మిస్సైల్ టెక్నాలజీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
27
How Indian cities stay safe from Pakistani missile threats
ఎస్-400 ట్రయంఫ్
రష్యా తయారు చేసిన ఎస్-400 ట్రయంఫ్ వ్యవస్థను భారత ప్రభుత్వం ముఖ్య నగరాల సమీపంలో మోహరించింది. ఇది 600 కిలో మీటర్ల దూరంలోనుంచి శత్రు మిసైళ్లను గుర్తించగలదు. 400 కిలో మీటర్ల పరిధిలోనే వాటిని నాశనం చేయగలదు.
శత్రు జెట్ విమానాలు, డ్రోన్లు, క్షిపణులు భారత గగనతలాన్ని చేరకముందే ఈ వ్యవస్థ వాటిని అంతం చేస్తుంది. శత్రుదాడుల నుంచి భారత్ ను రక్షించడంతో ఎస్-400 ట్రయంఫ్ కీలక పాత్ర పోషిస్తోంది.
37
How Indian cities stay safe from Pakistani missile threats
ఆకాష్ క్షిపణులు
దేశీయంగా తయారైన ఆకాష్ మిసైల్ వ్యవస్థ 50 కిలో మీటర్ల పరిధిలో గగనతలాన్ని కాపాడుతుంది. ఇది ఒకేసారి పలు లక్ష్యాలను టార్గెట్ చేయగలదు. యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను వెంటాడి అంతం చేయగల సత్తా ఉన్న దేశీయ డిఫెన్స్ వ్యవస్థ ఇది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై వంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల వద్ద ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది.
భారత BMD వ్యవస్థ రెండు స్థాయిల్లో పనిచేస్తుంది. PAD (ప్రథమ దశ) వ్యవస్థ ఎత్తైన గగనతలంలో శత్రు క్షిపణులను అడ్డుకుంటే, AAD (ద్వితీయ దశ) వాటిని భూమికి చేరకముందే గాల్లోనే అంతం చేస్తుంది. ఈ రెండు దశల రక్షణ వ్యవస్థ భారత నగరాలపై పడే దాడులను ముందే అడ్డుకుంటుంది.
57
India Missile Launch
సమర్ షార్ట్-రేంజ్ మిసైల్
12 కిలో మీటర్ల పరిధిలో పని చేసే సమర్ క్షిపణులు తక్కువ ఎత్తులో వచ్చే క్రూయిజ్ మిసైళ్లను, డ్రోన్లను టార్గెట్ చేసి అంతం చేస్తుంది. భారత నిరోధిత డ్రోన్ వ్యవస్థ C-UASతో కలిపి ఇవి అత్యంత సమీప బెదిరింపులను ఎదుర్కొంటాయి.
67
How Indian cities stay safe from Pakistani missile threats
24x7 నిఘా, వెంటనే స్పందించే చర్యలు
దేశం అంతటా రాడార్ కేంద్రాలు, పెట్రోల్ డ్రోన్లు భారత గగనతలాన్ని నిరంతరం పరిశీలిస్తున్నాయి. ఏదైనా అపాయం కనిపించిన వెంటనే స్పందించేందుకు తక్షణ చర్య బృందాలు, వైమానిక నియంత్రణ కేంద్రాలు సిద్ధంగా ఉంటాయి. ఇది భారత నగరాలను ఏ అనూహ్య దాడికైనా ముందుగా రక్షించేలా చేస్తుంది.
77
Indian Army
భారత సైన్యం & పౌర పరిపాలన సహకారం
అత్యవసర పరిస్థితుల్లో భారత సైన్యం పౌర పరిపాలనతో కలసి పనిచేస్తుంది. గగనతల నిషేధాలు, ప్రజలకు భద్రతా శిక్షణ కార్యక్రమాలు వంటి వాటిని సకాలంలో అమలు చేస్తుంది.
ఈ విధంగా, భారత నగరాలు అత్యాధునిక, బహుళ స్థాయి భద్రతా వ్యవస్థలతో పాకిస్తాన్ సహా ఏలాంటి దాడినైనా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉన్నాయి.