Top 5 Online Orders : ప్రస్తుతం అన్నీ ఆన్లైన్ లోనే లభిస్తున్నాయి. గుండుసూది నుండి కోట్లు విలువచేసే లగ్జరీ కార్ల వరకు ప్రతిదీ ఇంట్లో కూర్చునే ఆర్డర్ చేయవచ్చు. ఇలా 2025 లో కొందరు వ్యక్తులు కొన్ని వస్తువుల కోసం చేసిన ఖర్చు తెలిస్తే ఆశ్చర్యపోతారు.
spending habits : పెద్దపెద్ద నగరాల్లో జీవించేవారి ఆదాయం ఎక్కువగానే ఉంటుంది... ఖర్చు కూడా అదేస్థాయిలో ఉంటుంది. అందుకే గ్రామాలు, చిన్నచిన్న పట్టణాలతో పోలిస్తే నగరాల్లో వ్యాపారాలు జోరుగా సాగుతాయి. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఆన్ లైన్ లోనే షాపింగ్ లు, ఫుడ్ ఆర్డర్లు మరింత పెరిగిపోయాయి... చివరకు ఇంట్లోకి అవసరమయ్యే నిత్యవసరాలు కూడా ఇలాగే కొంటున్నారు. అందుకే స్విగ్గి ఇన్స్టామార్ట్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వంటి యాప్స్ పుట్టుకొచ్చాయి.
అయితే ఇలా ఆన్లైన్ లో వస్తువులు కొనేందుకు కొందరు పెడుతున్న ఖర్చు చూస్తే మతిపోతుంది. 2025 లో ఒకే వ్యక్తి అత్యధికంగా కొనుగోలు చేసిన వస్తువులేవి..? వాటికోసం ఎంత ఖర్చు చేశారు..? ఏ నగరంలో ఈ కొనుగోలు జరిగింది..? అనే ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
26
నూడుల్స్ కోసం ఇంత ఖర్చా..?
నూడుల్స్... అతి తక్కువ ఖర్చుతో కడుపు నింపుకునే అహారం. పేదరికాన్ని తెలియజేసేందుకు కూడా రోజూ 5-10 రూపాయల నూడుల్స్ ప్యాకెట్ కొనుక్కుని తిన్నరోజులు ఉన్నాాయని చెబుతుంటారు. అలాంటిది కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి 2025 లో నూడుల్స్ కోసం ఎంత ఖర్చుచేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఏకంగా రూ.4.36 లక్షలు.. మీరు చూస్తున్నది నిజమే, అక్షరాలా నాలుగు లక్షల ముప్పైఆరువేల విలువైన నూడుల్స్ ప్యాకెట్స్ ను ఆన్లైన్ లో ఆర్డర్ చేశాడు.
36
రెడ్ బుల్ కోసం రూ.16.3 లక్షలా..!
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో డబ్బులకు కొదవలేదని అంబానీ, అదానీ వంటివారినే కాదు ఇంకొందరిని చూసినా అర్థమవుతుంది. అలాంటి ఓ వ్యక్తి గురించి తెలుసుకుందాం. ముంబైలో నివాసముండే ఓ వ్యక్తి కేవలం రెడ్ బుల్ (షుగర్ లెస్ ఎనర్జీ డ్రింక్) కోసం ఏకంగా రూ.16.3 లక్షలు ఖర్చుచేశాడు. కేవలం 2025 ఒక్క సంవత్సరంలోనే ఇంత విలువైన రెడ్ బుల్ డ్రింక్ ఆన్లైన్ లో కొనుగోలు చేశాడు. ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు ముంబై ఎంత రిచ్చో అర్థమవుతుంది.
తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్ కొనుగోళ్ల ద్వారా తన జంతుప్రేమను చాటాడు. గత సంవత్సరం (2025) లో ఏకంగా రూ.2.41 విలువైన పెంపుడు జంతువులకు సంబంధించిన వస్తువులను ఆర్డర్ చేశాడు. ఇందులో జంతువుల అహారంతో పాటు ఇతర వస్తువులు ఉన్నాయి.
56
ప్రోటీన్ ప్రొడక్ట్ ఒకరు... ఒపోన్ కోసం ఇంకొకరు..
దేశ రాజధాని డిల్లీ శివారులోని ఓ యూజర్ కేవలం ప్రోటీన్ ప్రోడక్ట్ కోసం రూ.2.8 లక్షలు ఖర్చు చేశాడు. ఇక బెంగళూరుకు చెందిన మరో వ్యక్తి ఈ స్విగ్గీ ఇన్స్టామార్ట్ ద్వారా రూ.1.7 లక్షల ఐపోన్, రూ.178 లైమ్ సోడా ఆర్డర్ చేశాడు. ఇదికూడా గతేడాది జరిగిన అతిపెద్ద ఆన్లైన్ కొనుగోలే.
66
కండోమ్ ల కోసం లక్ష రూపాయలా..!
నిత్యావసర వస్తువులే కాదు చివరకు కండోమ్ లను కూడా ఆన్లైన్ లోనే ఆర్డర్ చేసే రోజులు వచ్చాయి. చెన్నైకి చెందిన ఓ యూజర్ 2025 లో ఏకంగా 228 సార్లు స్విగ్గి ఇన్స్టామార్ట్ లో కండోమ్స్ ఆర్డర్ పెట్టాడు. ఈ కండోమ్స్ ఆర్డర్ కోసం అతడు ఏకంగా లక్ష రూపాయలు ఖర్చు చేశాడు.